Published On: Sat, May 30th, 2020

ఆరోగ్యశ్రీ‌తో కార్పొరెట్ వైద్యం సైతం పేద ప్రజ‌ల‌కు అందుబాటులో ఉంది….

Share This
Tags

 

నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తారని, అటు ప్రజలు, ఇటు సొంత పార్టీలోని నేతలు భావించారు. కానీ జగన్మోహన్‌రెడ్డి ఆలోచన వేరు. కేవలం గతంలో ఉన్న పథకాన్ని అమలు చేయడం కాదు.. నిజంగా ప్రజలకు ఏది అవసరమో అది చేయాలి. అవసరమైతే ఈ పథకాన్ని మరింత విస్తృతం చేయాలి.. ఏ పేదవాడు డబ్బులేదనే కారణంతో అనారోగ్యంతో చనిపోకూడదనేది జగన్మోహన్‌రెడ్డి ఆలోచన. అందుకోసమే ఈ పథకంపై కొద్ది రోజులు కసరత్తు చేసి, అధికారులె, మేధావులు, పార్టీనేతలు, ప్రజల సలహాలు సూచనలు తీసుకుని సమగ్రంగా ఈ పథకంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈ పథకానికి ఒక రూపు తీసుకొచ్చారు. జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మైన మార్పులు చూసి సొంత పార్టీ నేతలే విస్తుపోయారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజలకోసం ఎంత పరితపిస్తారో ఈ పథకం అమలుతీరు చెబుతోంది.

ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రకటించి వదిలిపెట్టలేదు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేటు ఆసుపత్రులకే పరిమితం. ఆరోగ్యశ్రీ ఉన్నవారు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అందుకు కారణం ప్రభుత్వ ఆసుపత్రులంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే. అక్కడ వసతులు సరిగా ఉండవు, సిబ్బంది ప్రవర్తన సక్రమంగా ఉండదనేది ప్రజల భావన. ప్రజల్లో ఉన్న ఈ భావనను రూపుమాపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో ప్రభుత్వ ఆసుపత్రులను సమూలంగా ప్రక్షాళన చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీలో ప్రభుత్వాసుపత్రులను ప్రధాన భాగస్వాములు చేయాలనే దిశగా సిఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు.వైఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. ఏ చిన్న రోగం వచ్చినా… పేదవాడు ధైర్యంగా ఆసుపత్రికి వెళుతున్నారు. వేల రూపాయలు ఖర్చు అవుతుందేమోననే భయం పేదవాడిలో తొలగిపోయింది. 

About the Author