ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రడ్డి అధికారం చేపట్టి ఏడాది కావస్తుంది. అసలు జగన్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణం నవరత్నాలు. మరి ఈ నవరత్నాలు అధికారం చేపట్టిన ఈ ఏడాదిలో ఎంతవరకు అమలయ్యాయి. ప్రజలలో నవరత్నాలపై ఎలాంటి స్పందన కనిపిస్తోంది? ఈ అంశాలపై అంశంపై ప్రత్యేక పల్సెస్ వారి ఈ రాష్ట్రం డాట్ కాం ప్రత్యేక కథనం.
తండ్రి తలపెట్టిన పథకాలను పక్కాగా అమలు చెయ్యడం. కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తేవడం. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రథాన్ని కదం తొక్కించే తీరు, దేశంలోనే అపూర్వం. అనితర సాధ్యం అనిపిస్తుంది. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని సంక్షేమ శకం నడిచింది. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ.