Published On: Sat, May 30th, 2020

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మళీ రాజన్న రాజ్యం అని వైసిపి అభిమానులు సంబరపడుతున్నారు…

Share This
Tags

వైఎస్ జమానాలో సంక్షేమం కొత్త పుంతలు తొక్కింది. అభివృద్ధి అందలమెక్కింది. వ్యవసాయం పండగలా మారింది. అందుకు జలయజ్ణం దోహదపడింది. కొన్ని దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అనే మాట వింటున్నా దానికి రూపురేఖలు ఉండేవి కావు. అందుకే, వైఎస్ సీఎం అయిన తర్వాత పోలవరం పనులు మొదలయ్యాయి. దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పంచిన నాయకుడు వైఎస్. ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణల్లో పదుల సంఖ్యలో ప్రాజెక్టులు చేపట్టారు. అలీసాగర్ ఎత్తిపోతల, చాగల్నాడు లిఫ్ట్, దుమ్ముగూడెం, గాలేరు నగరి, గుర రాఘవేంద్ర, నెట్టెంపాడు, కేసీ కెనాల్ నవీకరణ, లెండి ప్రాజెక్టు, పోలవరం, ప్రియదర్శిని జూరాల, పులిచింతల, సంగం బండ, సింగూరు, సోమశిల, శ్రీపాదసాగర్, తారకరామ తీర్థ సాగరం, వెలిగల్లు, ఇలా 90కి పైగా ప్రాజెక్టుల పనులతో ఉమ్మడి ఏపీ కళకళలాడేది. సాగు నీరు జలజలా పారేది. ప్రతి పొలం నీటితడితో బంగారు పంట పండించాలన వైఎస్ తపన పడేవారు. ఆయన తలపెట్టిన ప్రాజెక్టుల్లో కొన్ని ఆయన హయాంలనే ప్రారంభమయ్యాయి. మరికొన్ని తర్వాతి కాలంలో పూర్తయ్యాయి. ఇంకా కొన్ని పెండింగులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎంతో మంది వైఎస్ సేవలను గుర్తు చేసుకుంటారు. జగన్ పాలనలో రాష్ట్రం నూటికి నూరు శాతం సస్యశ్యామలం అవతుందని ఆశాభావంతో ఉన్నారు.

2019లో నవ్యాంధ్ర ప్రజలు మళ్లీ రాజన్న రాజ్యం కోరుకున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ కు భారీ మెజారిటీతో అధికారాన్ని అప్పజెప్పారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం చెప్పిన వైఎస్ ను మించి, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథంలో కొత్త పుంతలు తొక్కారు. ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్నా, వేలకోట్ల రూపాయలతో ఎవరూ ఊహించని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైన జలయజ్ణానికి భారీగా నిధులు కావాలి. దానికంటే ముందు, నీటిని వాడుకోవడానికి పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు రాకుండా చూడాలి. అందుకే, తెలంగాణ సీఎం కెసిఆర్ తో జగన్ సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. సముద్రంలో కలిసే గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఈ రెండు రాష్ట్రాల్లో రైతులకు ఎలా మేలు చేయవచ్చనే దానిపై చర్చించారు. రాయలసీమకు గోదావరి నీటిని మళ్లించడానికి 60 వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టును తలపెట్టారు. పోలవరం ప్రాజెక్టులో నిధుల దుబారాకు అడ్డుకట్ట వేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అక్షరాలా 628 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఆదా చేశారు. ఇకమీదట అన్ని ప్రాజెక్టుల్లో రివర్స టెండరింగ్ చేయాలని నిర్ణయించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో రైతు పక్షపాత ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాత ఆ స్థాయిలో అన్నదాతను పట్టించుకున్న దాఖలాల లేవు. ఎన్నికల ప్రచారంలో జగన్ రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అన్నదాతకు అండగా ఉంటానని బాస చేశారు.

About the Author