కరోనా జయించాలంటే ఇవి తినాలి….
ప్రపంచ దేశాల ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్ (కోవిడ్-19) సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల గురించి ప్రపంచ వైద్య నిపుణులు ఇప్పటికే పలుసార్లు వెల్లడించిన విషయం తెల్సిందే. కరోనా వైరస్ సోకితే కచ్చితంగా ప్రాణాపాయమంటూ భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే ఎలాంటి ప్రాణహాని ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. కరోనా బాధితుల్లో మృతుల సంఖ్య 3.6 శాతానికి మించి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయగా, ఒక శాతానికి మించి ఉండదని లండన్, ఆస్ట్రేలియా వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
కరోనా వైరస్‌ను జయంచడంలో ప్రజల్లో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా దోహద పడుతోంది. ఈ రోగ నిరోధక వ్యవస్థ మనం తీసుకునే ఆహారం అలవాట్లపై ఆధారపడి ఉంటుందని, రోగ నిరోధక వ్యవస్థను పెంచే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందని ఆస్ట్రేలియా వైద్యులు సూచిస్తున్నారు. మన వంటకాల్లో, తినే పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే అల్లం, ఉల్లిపాయ, క్యారెట్లు, గుమ్మడికాయ, పసుపు లాంటివి రోజు ఒక్కసారైనా ఉండేలా చూసుకోవాలి. రోజు విడిచి రోజు నాలుగు రకాల కూరలు లేదా కూరగాయలు తినాలి. వీటిలో పాలకూర, బ్రోకలీ, పుట్ట గొడుగులు ప్రశస్తమైనవి. అల్ల నేరేడు పండ్లు, బెర్రీలు, దానిమ్మ పండ్లు, బాదం గింజలు వారానికి మూడుసార్లు తీసుకోవాలి. వీటిలో రోగ నిరోధక శక్తిని పెంచే సీ, బీ, ఈ విటమిన్లు ఉంటాయి. చేపలు, గుడ్లు, మాంసంలో కండరాలు, ఎముకలను బలంగా ఉంచే ప్రొటీన్లతోపాటు డీ సహా 20 రకాల విటమిన్లు ఉంటాయి. జింకు ఎక్కువగా ఉండే నత్త గుల్లలు వారానికి ఓసారి తినడం మంచిది.
వీటన్నింటితోపాటు బ్యాక్టీరియా సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి మరింత పెరగుతుందని ఆస్ట్రేలియా న్యూట్రిషనల్ థెరపిస్ట్ హన్నా బ్రాయ్ తెలిపారు. అలాగే రోజు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేలా చేసుకున్నట్లయితే సులభంగానే కరోనా వైరస్‌ను జయంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
Keywords: Few types of food helps to prevent carona virus, keep good health for eating proper good dite