విద్యారంగంలో విప్లవాత్మక సంక్షేమ పథకం ఫీజు రీయింబర్స్ మెంట్….
విద్యారంగంలో విప్లవాత్మక సంక్షేమ పథకం ఫీజు రీయింబర్స్ మెంట్. దాన్ని మరింతగా విస్తరించి, పాఠశాల స్థాయిలోనూ పేదింటి తల్లులకు మేలు చేకూర్చే పథకం జగనన్న అమ్మ ఒడి. 2008లో ఆనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. డాక్టర్ సేవలు అందించాలని, ఇంజినీర్ గా మంచి ఉద్యోగం సాధించాలని కలలుగన్న యువతకు ఈ పథకం ఓ వరం లాంటిది. ఇప్పుడు జగన్ సర్కార్ ఈ పథకాన్ని కొనసాగిస్తూనే అమ్మ ఒడి అనే మరో వినూత్నమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. 2019 జూన్ పదో తేదీన ఈ పథకాన్ని జగన్ ప్రారంభించారు. ఒకటి నుంచి పన్నెడోం తరగతి, అంటే ఇంటర్మీడియెట్ సెకండియర్ వరకూ విద్యార్థులను బడికి, కాలేజీకి పంపితే చాలు. ఆ తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు ఠంచనుగా ప్రతి ఏడాది జమవుతాయి. సంపన్న రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వమూ ప్రారంభించే సాహసం చేయని ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు జగన్.
వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజలకు ఏ విషయంలోనూ ఏ దిగులూ లేదు. పేద కుటుంబంలో పుట్టిన బడుగు వాళ్లకు, అగ్రవర్ణాల పిల్లలకు పెద్ద చదువులు ఎలా అనే బెంగ లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ అనే విప్లవాత్మక పథకంతో లక్షల మంది పేద విద్యార్థులు పెద్ద చదువులు చదివే అవకాశం వచ్చింది. ఆయన కుమారుడు జగన్ సీఎం అయిన తర్వాత, నవ్యాంధ్రలో బడి పిల్లల చదువులు పేదింటి తల్లులకు భారం కారాదని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లల తల్లులకు ఏటా 15 వేల రూపాయల ఇన్సెంటివ్ ఇచ్చే జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఇంటర్ రెండో సంవత్సరం వరకూ పిల్లల చదువులు తల్లులకు భారం కారాదనేది ఈ పథకం ఉద్దేశం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు, అంటే BPL ఫ్యామిలీస్ కు ఈ సహాయం అందుతుంది