Published On: Sat, May 30th, 2020

పెద్ద చదువులు పేదలకు భారం కారాదని ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన పథకం ఫీజు రీయింబర్స్ మెంట్. ఇంత కాలానికి మళ్లీ వంద శాతం లబ్ధితో పక్కాగా అమలు చేయడానికి అవకాశం వచ్చింది….

Share This
Tags

విప్లవం అంటే తుపాకీ పడితేనే రాదు. భారతదేశంలో హరిత విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం గురించి విన్నాం. 2004 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ ఊహించని ఓ కొత్త విప్లవం వచ్చింది. అదే, సంక్షేమ విప్లవం. దేశంలో ఎవరూ ఊహించనన్ని సంక్షేమ పథకాలతో ప్రజలకు జీవితమే ఒక పండగ, రైతులకు వ్యవసాయం పండగ, విద్యార్థులకు పెద్ద చదువుల పండగ కోసం అండగా నిలిచారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజలకు ఏ విషయంలోనూ ఏ టెన్షన్ లేదు. చార్జీలు పెరుగాయనే భయం లేదు. ప్రభుత్వం పట్టించుకోదనే బాధలేదు. పేద కుటుంబంలో పుట్టిన బడుగు వాళ్లకు, అగ్రవర్ణాల పిల్లలకు పెద్ద చదువులు ఎలా అనే దిగులు లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ అనే విప్లవాత్మక పథకంతో లక్షల మంది పేద విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, ఎంసిఎ తదితర కోర్సులు పూర్తి చేసే చాన్స్ వచ్చింది. ఇవాళ హైదరాబాద్ హైటెక్ సిటీలో, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో, పుణెలోని టెక్ పార్కులో, అమెరికాలోని సిలికాన్ వేలీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా భారీ వేతనాలతో పనిచేసే వాళ్లలో, ఫీజు రీయింబర్స్ మెంట్ పొందిన వాళ్లున్నారు. పేదింట పుట్టి పెరిగి, ఈ పథకంతో దశ తిరిగిన వాళ్లున్నారు. కలలు నిజం చేసుకున్న వాళ్లు, కుటుంబాలకు పెద్దదిక్కుగా మారిన యువతీ యువకుల వల్ల సమాజానికి కలిగిన మేలు- మాటల్లో చెప్పలేం. డబ్బు రూపంలో కొలవలేం. వైఎస్ తర్వాతి కాలంలో ఈ పథకాన్ని వివిధ కొత్త షరతులతో ప్రభుత్వాలు అమలు చేశాయి. ఖజానాపై భారాన్ని తగ్గించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు నవ్యాంధ్రలో జగన్ సర్కార్ మళ్లీ రాజశేఖర రెడ్డి తరహాలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తోంది. పేదలకు పెద్ద చదువుల భరోసా ఇస్తోంది.

రావాలి జగన్ అంటే వచ్చారు జగన్. నిజానికి, తండ్రిని మించి ఎన్నో కొత్త పథకాలను శ్రీకారం చుట్టారు. రాజన్న ఆరోగ్యశ్రీ యధావిధిగా అమలు చేస్తున్నారు. వైఎస్ హయాంలో కనీ వినీ ఎరుగని సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఖాళీ ఖజానా వెక్కిరిస్తున్నా లెక్క చేయడం లేదు. అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైతే అప్పు చేయడం, ఇతరత్రా మార్గాల్లో నిధులను సమీకరించడం తన బాధ్యతగా జగన్ భావిస్తున్నారు. అందుకే, ఏడాదిలోనే ఈ స్థాయిలో సంక్షేమానికి నిధులు వెచ్చిస్తున్న జగన్ పాలనను జనం కూడా మెచ్చుకుంటున్నారు. ఖజానాపై భారం పడుతోందని ప్రజలను విస్మరించే ముఖ్యమంత్రి కాదు, నిజమైన ప్రజల మనిషి అని కీర్తిస్తున్నారు.

About the Author