Published On: Sat, Mar 30th, 2013

83 మంది సజీవ సమాధి!

Share This
Tags

టిబెట్‌లోని ఓ బంగారు గని ప్రదేశంలో శుక్రవారం మట్టిచరియలు విరిగిపడటంతో 83 మంది కార్మికులు సజీవంగా సమాధి అయ్యారు. లాషా కౌంటీలోని మాయిజోకుంగార్ వద్ద ఈ ఉదంతం చోటుచేసుకుందని ఈ మేరకు ‘జిన్హువా’ వార్తసంస్థ పేర్కొంది. బాధితుల్లో ఇద్దరు టిబెటన్లు కాగా, మిగతావారు చైనా నేషనల్ గోల్డ్ గ్రూప్ కార్పొరేషన్ కార్మికులు ఉన్నట్లు తెలిపింది. సుమారు 3 కి.మీ. మేరకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, రాళ్లు రప్పలు విరిగిపడ్డాయని, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు సహా మొత్తం వెయ్యి మంది వరకూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొంది.

About the Author

-