5న బీసీ స్టడీసర్కిల్ ప్రవేశ పరీక్ష
గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకుగాను బీసీ స్టడీసర్కిళ్లలో ఉచిత శిక్షణ పొందడం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 5న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ స్టడీ సర్కిల్ డెరైక్టర్ మల్లయ్యభట్టు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 22 స్టడీసర్కిళ్ల పరిధిలో పరీక్ష నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు.