Published On: Sat, Aug 5th, 2017

విలువలు తో కూడిన నడవడిక …

Share This
Tags

అది వేసవి కాలం. ఫ్యాన్ తిరుగుతున్నా ఉక్కపోతతో వొళ్ళంతా తడిసిపొతొంది. ఆ ముందు రోజు అంతా ఆత్మీయులతోను ఎంతో సరదాగా గడిపి , చాలా రోజుల తరవాత కలసిన ఫ్రెండ్స్ఆ రాత్రి అంతా వైజాగ్ బీచ్ లో తిరిగి, తిరిగి కాళ్ళు నెప్పులు పుట్టాక వచ్చి అమ్మ, అబ్బా అంటున్న వినకుండా తన ఫ్రెండ్స్ చెప్పే సోది వింటూ ఎపుడు నిద్రలోకి జారోడో తెలీలేదు శివ కుమార్ కి.

హఠాత్తుగా ఫోన్ రింగ్ అవసాగింది. వెంటనే ఎవరో తెలిసినట్లు హలో రమేష్! ఏంటిరా చెప్పు అన్నాడు. అవతల ఓ నవ్వు వినపడింది. ఏంటిరా వెధవా ఆ నవ్వు ? నిన్ను అంటూ అలవాటుగా డిస్ప్లే చూసాడు ఫోన్ ది. అంతే వున్నా నిద్ర తిక్క ఎగిరిపోయింది శివ కి . అమ్మా! సారీ అమ్మా, అది అదీ అంటుంటే , సరేలే గాని, లే, నీవు వూరికి వెళ్ళాలన్నావుగా ముందు. ఇపుడు లేచి అన్ని పూర్తి చేసి బస్సు ఎక్కేటప్పటికీ ౬ అవుతుంది. లే ముందు అన్న అమ్మ మాటలకి లేచాడు శివ. అమ్మా!, అబ్బా ! అంటూ లేచి మొత్తానికి పరుగులతో బస్సు కాంప్లెక్స్ కి వచ్చాడు ఫ్రెండ్స్ తో వూరు వెళ్ళడానికి.

ఫ్రెండ్స్ అందరితో వాళ్ళ వూరు వెళ్లి, అక్కడ నుండి వాళ్ళ బావ ప్రసాద్ ( అక్క మరిది + మామయ్య కొడుకు ) పెళ్లి కి వెళ్ళాలి. వాడు తన ఈడు వాడే. అదీ హడావిడి శివ కి. ఒరేయ్ ! ఏంటి రా ఆ పరధ్యానం ? అంటూ లైన్ లో నిల్చున్న సురేష్ అరిచాడు. అబ్బబ్బ, ఎం లేదురా నిద్ర వస్తోంది అంటూ అక్కడ వున్నా నాన్-స్టాప్ కౌంటర్ దగ్గర కూర్చున్నాడు నీరసంగా. ఒరెయ్ మీరు తియ్యందిరోయ్ నాక్కూడా అంటూ.

హఠాత్తుగా ఓ అరుపు వినిపించింది. ఏయ్! ఆలా గుడ్ల గూబ లా నిలబడక పొట్టే వెళ్లి తియ్యవే టికెట్. దొంగ ముం…….. వెధవ చూపు నువ్వునూ. అంటూ. ఓ పెద్దాయన అరుస్తున్నాడు ఓ 20 -22 ఏళ్ళ. కూతురితో. అదీ కాదు నాన్న ! అక్కడ అందరు అందరు అబ్బాయిలు…. అంటూ మాట పూర్తి అయ్యేలోపు, అబ్బో ! పెద్ద పాతివ్రతవి మరి. ఏమి రోజు కాలేజిఫ్ కి వెళ్లడం లేదా బస్సు లో. ఎంతమంది ఉండటం లేదు. నోరుమూసుకుని టికెట్ తియ్యవే దొంగ మొహం అంటూ హుంకరించాడుకూతురి పై తాగిన మత్తులో. అందరు తననే చూస్తుంటే సిగ్గుతో తలదించుకుంది. కన్నీళ్ళని కంటిలోని ఆపుకుందామన్న ఆగాను అంటూ అవి ప్రవహించ సాగాయి చెంపలమీద.

VILUVAచూసాడు శివ. తన ఫ్రెండ్స్ కి సైగ చేసాడు. ఒక టికెట్టే నా! ఇలా ఇవ్వమ్మా డబ్బులు. నేను తీస్తా అంటూ సురేష్ ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని, కాసింత ఊరటని అందించాడు ఆ అమ్మాయికి.
ఇంతలో టికెట్స్ తీసుకున్నవారంతా బస్సు ఎక్కారు ఒకరొకరుగా. సురేష్ ఇచ్చిన టికెట్ తండ్రి చేతిలో పెట్టి , కృతజ్ఞతగా ఓ చిన్న చిరునవ్వు తో శివ వంక చూసింది ఆ అమ్మాయి. ఫరవాలేదన్నట్లు చేయితో తుమ్మేసుప్ చూపాడు శివ. మొత్తం 6 గురు బయలుదేరారు శివ తో కలిపి. ఓ నలుగురు రెండు రెండు సీట్స్ లో కూర్చుంటే మిగిలిన ఇద్దరు మూడు సీట్స్ లో కూర్చున్నారు తమ నంబర్స్ బట్టి. వీరి మద్యలో ఆ పెద్ద తాగుపోటుకి టికెట్ తీసి నందువల్ల ఆయన వీరి మధ్యలో కూర్చోవాల్సి వచ్చింది. ఓయ్, విండో సీట్ నాది అంతో దబాయిస్తున్నాడు సురేష్ ని ఆయన. అందరిలోనూ సురేష్ ని లేపి ఆ ప్లేస్ లో కాస్త బొద్దుగా, భారీగా వుండే రామకృష్ణ కూర్చున్నాడు. ఇక ఆ పెద్దాయనకు తప్పుల మధ్యలో కూర్చోవడం. ఏమి చేయాలో తెలీక, నోరు మూసుకోకుండా తిట్ట సాగాడు కూతుర్ని అలాంటి టికెట్ తీసినందికు అడ్డు ఆపు లేకుండా.

ఇంతలో కొఫ్ఫిఈ కి దిగారు సురేష్ హరీష్ లు. ఓ పెద్దావిడ ఆయాసపడుతూ. హమ్మా, అబ్బా అంటూ యోగార్చ సాగింది బోలెడు సామానుతో. నడవలేక ఓరి నాయనోయ్ అంటూ కూల బడింది ప్లాట్ఫారం లో. అంట సామాను ఒక్కర్తే ఇలా మోస్తుందో అర్ధం కాక పస్సెంగెర్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకో సాగరు. సురేష్, హరీష్ లు ఇద్దరు వెంటనే పాడండమ్మా సామాను మేము తెస్తాం అంటూ అవ్విదని సీట్ లో కూర్చో పెట్టారు. ఆ సామాన్లు అన్ని ఒకటి ఒకటి తెచ్చి సర్దసాగారు బస్సు లో అన్ని పక్కల. అదీ ఆవకాయ పచ్చడి జాడీ, జాగ్రత్త. మిగలకుండా పెట్టు. ఆ ఎర్ర సంచిలో జంతికలు, కజ్జికాయలు వున్నాయ్ చితికి పోకుండా పెట్టు. ఆయా సూట్ కేసు లో పట్టు చీరలు వున్నాయ్, జాగ్రత్త తిరగేసి పెట్టకు అంటూ హుకుం జారీ చేయ సాగింది ఆవిడ. పోనీలే పెద్దది అని వీళ్లిద్దరు సర్ది, ఒరెయ్ ఇంకా కండక్టర్ రాల. ఇంకో కొఫ్ఫిఈ తాగి వస్తాం అంటూ మల్లి దిగారు. మీరు మారరర బాబు అంటూ నవ్వు కున్నాడు శివ.

ఇంతలో కండక్టర్ అరుస్తున్నాడు పొద్దున్న వేళా కదా. ఎవరైనా టికెట్ తీసి ఏ బాత్రూం కో వెళ్లిన వారుంటే త్వరగా వస్తారన్న ఉద్దేశ్యం తో. పలాస, టెక్కలి, ఇచ్చ్చాపురం అంటూ. ఎదో లోడ్ వేస్తున్నట్లున్నారు బస్సు పైన . దబ్ దబ్ మంటూ సౌండ్ వస్తోంది. అబ్బబ్బ వెధవ బస్సు అంటూ ఆరవ సాగింది ఆ ధనవంతురాలైన పెద్దావిడ. అటుగా చుసిన శివ ఆశ్చర్యపోయాడు, ఆవిడ ఎందుకు అరుస్తోందో అర్ధం అయ్యేసరికి. ప్రయాణీకుల్లో ఓ సాధారణ స్త్రీ కాటన్ చీర , పసుపు తాడు, నల్లపూసల గొలుసు, మట్టి గాజులు వేసుకుని ఆవిడ పక్కనే కూరుచుండి. పమిట నిండుగా కప్పుకుని. అలాంటి డబ్బు లేని స్త్రీ తన పక్కన కూర్చోవడం ఆవిడకి నచ్చాల. మరి వొళ్ళంతా బంగారం దిగేసిందిగా ఆవిడ . అర్ధం ఐయింది శివ కి. ఎం చెయ్యాలి ఎలాంటి వారిని? వీరి ఆలోచనలు ఎప్పటికి మారతాయి అని ఆలోచించ సాగాడు. ఆవిడ హఠాత్తుగా అరవసాగింది ఎదో ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నట్లు. ఏంటది ? ఆ చెయ్యి తగిలిస్తావ్ ? ఆయ్! అంటూ ఆ సాధారణ వేషం కల ఆవిడతో. లేదమ్మా, నేను నా సీట్లో నే కూర్చున్నా అంటున్న, ఏం ఇంకో సీట్లో కూర్చవచ్చుగా. మా ఇంట్లో పని మనిషికి ఇష్టం 5000 జీతం తెలుసా ! ఎంత శుభ్రంగా ఉంటుందో. అబ్బా, ఛీ! ఇలాంటి వాళ్ళు ఎక్కే బస్సు నేను ఎక్కాల్సి వచ్చింది. ఛా ఛా ఛా, ఎదో ట్రైన్ లో రిజర్వేషన్ దొరక్క, కార్ ట్రౌల్ ఇచ్చి, ఇలా బయలుదేరా. అదే మా చెన్నై లో అయితేనే ఇంటినిండా నౌకర్లు, చక్కర్లు, BMW కారు అంటూ ఆవిడ దండకం మొదలెట్టింది. పిల్లి మీద, ఎలక మీద అంటున్నట్లున్న అవి ఆ మామూలు స్త్రీ మీద అంటున్నవ్ అని అందరికి అర్ధం ఐయింది.

ఆవిడ పోరు భరించలేక, పసృజం స్ మాసములు ఇల్లస్లు లేచింది వేరే సీట్ లోకి మారుదామని. అపుడే వస్తున్నా కండెక్టర్ ఏమైనా కావాలమ్మా ? ఎందుకు దిగుతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. అదీ కదండీ ! ఆవిడకి నేను అక్కడ కూర్చోవడం నచ్చాల అందుకే సీట్ మారుదామని అంది. సీట్స్ లేవమ్మా. ఓన్లీ బ్యాక్ సీట్లే వున్నాయ్. అక్కడ కూరుచుంటే ఆడవారికి ఇబ్బంది. అయినా మీది 2 వ నంబరు కదా. కూర్చోమ్ది మీ సీట్లో. అంటూ ఆ పెద్దావిడ వంక చూసి ఏంటమ్మా మీరు ? మీ సీట్ చాలక పక్క వారి సీట్ లో సగం దాకా ఆక్రమించి పైగా ఆవిడని మాటలు అంటారా ? సీట్ మారండి అని. తప్పుకాద్ధ. జరగనుంది అని గ్డదించాడు. విసుక్కుంటూనే ఆవిడా భారీ కాయాన్ని కాస్త కదల్చింది. ఈ మామూలు ఆవిడ కూరుచుండి చేతులు కట్టుకుని ఎక్కడ తగులుతాయి అని తన సీట్లోనే కూర్చున్నా.

సడన్ గ పైకి లేచిన శివ ఒక్క నిముషం కండక్టర్ గారు ! అంటూ సురేష్, హరీష్ లాక్ సైగ చేసాడు రమ్మని మంటూ. రామకృష్ణకు సైగ చేసాడు నువ్వు లేవద్దంటూ. ముగ్గురూ గబగబా సర్దిన సామాను అంత దించేయ సాగారు. ఒక్క నిమిషం జరుగుతున్నది అర్ధం కాక, ఆ పై అయ్యో వద్దయ్యా ఉంచండి. ఎందుకు దిమ్పెస్తున్నారు? అంటూ పెట్టు అక్కడ అంటూ హుకుం జారీ చేసింది. ఏమి మాట్లాడకుండా ఆవిడ అన్ని సామానులు దింపేసి, పడండి కండక్టర్ గారు. బస్సు తియ్యండి డ్రైవర్ గారు అన్నాడు శివ. ఆ డబ్బుగల ఆవిడ దిగి ఏం చెయ్యలేక నిలుచుంది పోయింది ఎంప్లాట్ ఫారం పైనే అందరిని కలిపి తిడుతూ. అందరూ నవ్వ సాగరు బస్సు లో నుండి. చివర్లో శివ ఎక్కి చూడండి కండక్టర్ గారు ! మీరు ఎన్ని మాటలు అన్న అలాంటి డబ్బు మదం వున్నా వారికి మనుషుల విలువ, సాయం విలువ తెలీదు. వారికి ఇదే సరైన గుణపాఠం. డబ్బు, నాగలికి ఇచ్చే పాటి విలువ సాటి మనిషికి ఇవ్వనప్పుడు మా లాంటి వాళ్ళం వీటిని సహించలేము. సహించరాదు. సహాయం విలువ ఇచ్చి పుచ్చుకునేవారికి త్తెలిసి ఉండాలి. అంటే అన్నాడు అందరికి వినపడేటట్లుగా. శభాష్ బాబు. చిన్నవాడివైనా చక్కగా చెప్పావ్ విలువ తెలియని వారికి విలువలు ఇలాగే నేర్పాలి అన్నాడు డ్రైవర్ చప్పట్లు కొట్టాడు అందరితో పాటు కలిపి బస్సు లో. చిరునవ్వుతో, ఆప్యాయంగా చూసింది ఆ సాధారణ స్త్రీ చిన్నగా చేతులు జోడించి శివ వైపు చూస్త్తూ. వద్దమ్మా, వద్దు. నేను మీ కన్నా చిన్న వాడిని. ఆశీర్వదించాలి అంతే అంటుంటే చెమర్చిన తన కళ్ళని కొంగుతో తుడుచుకుంటున్న ఆవిడని చూసి తలవంచుకుంది ఆ ఖరీడైన స్త్రీ ప్లాట్ఫారం నుండి చూస్తూ. రైట్ రైట్ అంటుంటే కండక్టర్ బస్సు బయలుదేరింది.

ఇక అపుడే అసలు కథ మొదలైంది బస్సు బయలు దేరిన ఓ 15 నిమిషాల తరవాత. నెమ్మదిగా రామకృష్ణ మొదలుపెట్టాడు ఆ తాగుబోతు మనిషితో. ఏమయ్యా పెద్దమనిషి ! ఇందాకటి నుండి చూస్తున్నాను. ఒకటే తిడుతున్నావ్ నీ కూతుర్ని ? సిగ్గుమాడా అసలు ? పైగా తాగి బూతులు తిడతావా కన్నా కూతురు అని చూడకుండా ? అబ్బాయిలందరి ముందు. పాపం ఆ అమ్మాయి నిను తిరిగి కొట్టాల్సింది. మా వాళ్లందరం కలిపి నిన్ను కుమ్మేసేటోళ్లం. రేపటి నుండి నిన్ను నడి బజార్లో నిల్చోపెట్టి తండ్రి అని చూడకుండా తిట్టిస్తా. ఎం చేస్తావ్? నీ దిక్కున్న చోట చెప్పుకో ఫో. అంటూ ఇద్దరి మధ్య గల ఆయనని దారి అంట చేతుల్తో పొడుస్తూ పిచ్చ తిట్లు తిట్ట సాగాడు రామకృష్ణ. బాబోయ్! డ్రైవర్ గారు నన్ను దింపెయండి. ఈ కుర్రాళ్ళు సంపేస్తాన్నారు అంటున్న , మీరు పోనీయండి డ్రైవర్ గారు. వీడికి కోటింగ్ ఇంకా పూర్తి ఆవల అంటూ మళ్ళా సహస్ర దండకం అందుకున్నాడు రామకృష్ణ , అంతకుముందు తిట్టిన అస్తోత్రం సరిపోలేదంటూ. ఆ తాగుబోతుకి దిక్కు తోచక, పిచ్చి చూపులు చూస్తున్నాడు తాగండి దిగిపోయి. అందరు బస్సు లో తమ హర్షాతిరేకాలు షేక్ హాండ్స్ ద్వారా చెప్పసాగారు శివకి, ఫ్రెండ్స్ కి కండక్టర్ తో సహా. శ్రీకాకుళం ఊరి పొలిమేరల్లోకి వచ్చాక అర్జెంట్ డ్రైవర్ . బస్సు ఆపండి అంటూ బాత్రూం వేలు చూపాడు ఆ తాగుబోతు తండ్రి. ఇంకా చేలు అన్నట్లు బస్సు ఆపాడు డ్రైవర్ రామకృష్ణ వంక చూసి. బస్సు దిగి అంటున్నాడు అతనే రామకృష్ణకు వేలు చూపిస్తూ. ఒరేయ్ నా సంగతి తెలీదు నీకు. పోలీస్ కంప్లైట్ ఇస్తా. ఎస్ ఐ న ఫ్రెండ్ అన్నాడు బెదిరింపుగా. పోరా గొట్టం . నేను దిగాక కాదు. బస్సు లో నాతొ ఇపుడే రా. మల్లి నీకు చుక్కలు చూపిస్తా పగలే. పోల్స్ స్టేషన్ లో నేను రివర్స్ కంప్లైంట్ పెడతా. నువ్వే నన్ను తిట్టవని, కొట్టవని. నాకు సి. ఐ తెలుసురా అంటూ, తన తిట్ల పురాణానికి తేర దించాడు రామకృష్ణ. అందరు ఘొల్లుమని నవ్వారు . వారితో శివ శృతి కలిపాడు. ఆడపిల్లల విలువ తెలీని వెధవ అనుకుంటూ. ఎందుకో కళ్ళ ముందు ఆ అమ్మాయి కృతజ్ఞతగా నవ్విన చిరునవ్వే! , ఇపుడు పకపకా , ఆనందం గా నవ్వుతున్నట్లు కనపడుతుంటే వెలకట్టలేనిది, విలువైనదిగా అనిపంచింది శివ కి.

— జె.ఎస్.శైలజ

About the Author