150 ఏళ్ల ఆయుష్షును ఇచ్చే మందులు!
వందేళ్ల ఆయుష్షును పొందడమే ఒక రికార్డుగా మారుతున్న తరుణంలో… మనిషికి ఏకంగా 150 సంవత్సరాల ఆయుష్షును ప్రసాదించగల మందులు వచ్చే ఐదేళ్లలో అందుబాటులోకి రానున్నాయని అంటున్నారు పరిశోధకులు! శరీరంలో వయసుపై ప్రభావం చూసే ‘ఏజింగ్ ఎంజైమ్’పై ప్రభావం చూపే మం దుల ద్వారా దీర్ఘాయుష్షు సాధ్యమేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీని వల్ల వయసు ప్రభావంతో వచ్చే వ్యాధులను నిరోధించవచ్చని, ఫలితంగా ఆయుష్షు పెరుగుతుందన్నారు. యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్ వైద్యవిభాగం చేపట్టిన ఈ అధ్యయనం ‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితం అయ్యింది. క్యాన్సర్, డయాబెటిస్, అల్జీమర్స్ తదితర వ్యాధు లు తలెత్తే అవకాశమే లేకుండా చూసే మందులను వాడటం ద్వారా 150 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఎస్‌ఐఆర్‌టీ1 అనే ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందులపై ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు.