Published On: Thu, Feb 28th, 2013

100 సంవత్సరాల సినిమాకి ప్రభుత్వమిచ్చిన అరుదైన కానుక.!

Share This
Tags

ఇండియన్ సినిమాకి గాడ్ ఫాదర్ గా చెప్పుకునే దాదా సాహెబ్ పాల్కే తీసిన ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’ తో సినిమా చరిత్ర మొదలైంది. ఈ సినిమా 1913 మే 3వ తేదీన విడుదలైంది. ఈ సినిమాతో మొదలైన ఇండియన్ సినిమా ప్రస్థానం ఈ సంవత్సరంతో 100 సంవత్సరాల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా 100 సంవత్సరాల ఇండియన్ సినిమాకి మన భారతీయ ప్రభుత్వం ఒక అరుదైన కానుకను అందించనుంది. ఈ విషయాన్ని మన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశ ప్రారంభ వేడుకలో తెలిపారు.

” భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా ముంబైలో సినిమా రంగానికి సంబందించిన ఒక ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని’ ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ మ్యూజియంలో సినిమాలకు సంబందించిన అన్ని వివరాలు, వస్తువులు ఉండవచ్చని అనుకుంటున్నారు, కానీ ఇందులో ఏమేమి ఉంటాయి అనేది అధికారికంగా తెలుపలేదు త్వరలోనే వివరాలు తెలిసే అవకాశముంది.

About the Author