హైదరాబాద్లో సీతమ్మ వాకిట్లో .. 50రోజుల వేడుక
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ఫ్యామిలీ, యూత్ అని తేడా లేకుండా అందరినీ మెప్పించి ఈ సంక్రాంతి బంపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు. ఈ చిత్రం 50రోజుల వేడుక హైదరాబాద్లో మార్చ్ 3న జరగనుంది. ఈ వేడుకకి ప్రధాన తారాగణం అంతా హాజరుకానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్స్. 20 సంవత్సరాల తరువాత వచ్చిన మొదటి మల్టీ స్టారర్ కావడంతో సాఫీగా సాగిపోయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అందరూ ఆదరించారు.