హత్యాయత్నం నుంచి తప్పించుకున్న ముషార్రఫ్
దేశద్రోహం కేసు విచారణ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ గురువారం తెల్లవారుజామున హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రావల్పిండిలోని సైనిక హృద్రోగ ఆస్పత్రి నుంచి ఇస్లామాబాద్‌లోని ఫాంహౌస్‌కు ఆయన చేరుకున్న 20-25 నిమిషాల వ్యవధిలోనే ఫాంహౌస్‌కు సమీపంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ముషార్రఫ్ కాన్వాయ్ ప్రయాణించిన రోడ్డు కింద ఓ డ్రైనేజీ పైపులో దుండగులు ఈ బాంబును అమర్చారు. ముషార్రఫ్ లక్ష్యంగానే ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.