Published On: Tue, Mar 5th, 2013

స్వల్పకాలిక కోర్సులు.. స్వయం ఉపాధికి మార్గాలు!!

Share This
Tags

అందరికీ ఉద్యోగాలు అసాధ్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ సంస్థలు అందిస్తున్న స్వల్పకాలిక కోర్సులు నిరుద్యోగులకు ఎంతో తోడ్పడుతున్నాయి. వీటిని ప-ర్తి చేస్తే వెంటనే ఉద్యోగావకాశాలు పొందొచ్చు.. లేదా స్వయంఉపాధిని పొందుతూ, మరో నలుగురుకి చేయూతనందించవచ్చు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలందించే స్వయం ఉపాధి కోర్సులపై ఫోకస్..

సెట్విన్
స్వయం ఉపాధితో నిరుద్యోగ సమస్యను చాలా వరకు తగ్గించే ఉద్దేశంతో 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చే సిన సంస్థ సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్). స్వయం ఉపాధి పేరుచెప్పగానే టక్కున గుర్తొచ్చేది సెట్విన్. నిరుద్యోగ యువత మొదలు వ్యాపార రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడంలో ఈ సంస్థ ఎనలేని పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తూ.. పది, ఇంటర్.. అంతకంటే తక్కువ చదువుకున్న వారికి అనేక స్వయం ఉపాధి మార్గాలు చూపుతోంది.

శిక్షణ… ఆపై ఉపాధి:
సెట్విన్ నిరుద్యోగులకు అనేక రకాల వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. వికలాంగులు, మహిళలు, విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్న వారికి సైతం ప్రయివేటు రంగంలోని పలు విభాగాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ, మినీబస్ ట్రాన్స్‌పోర్టు పథకాలు, కంప-్యటర్ శిక్షణ, వేజ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్, ఉత్పాదక పథకాలు, ట్రేడింగ్, స్వయం ఉపాధి పథకాలతోపాటు ఇక్కడ కోర్సులు ప-ర్తిచేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేవిధంగా ప్రత్యేకంగా ప్లేస్‌మెంట్ సెల్ నిర్వహిస్తోంది.

అందిస్తోన్న కోర్సులు:
– మూడు నెలల కంప-్యటర్ కోర్సులు: ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా,వెబ్ డిజైనింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప-్యటర్ హార్డ్‌వేర్, కంప-్యటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప-్యటర్ అకౌంటెన్సీ(అడ్వాన్స్‌డ్), యూనిక్స్, సీ, సీ++ మొదలైనవి.
– 45 రోజుల కోర్సులు: కాల్‌సెంటర్ ట్రైనింగ్, కంప-్యటర్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రాం.
– ఆరు నెలల టెక్నికల్ కోర్సులు (ఏడో తరగతి విద్యార్థులకు):ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, గోల్డ్ పాలిషింగ్ (3 నెలలు), ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెషినరీ వర్క్, ప్లంబింగ్, కార్పెంటరీ కోర్సులకు ఏడో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినా అర్హులే.
– పదో తరగతి అర్హతతో: రేడియో అండ్ టీవీ(బ్లాక్ అండ్ వైట్, కలర్), (9 నెలలు); రేడియో, టీవీ కలర్ బ్లాక్ అండ్‌ైవైట్ (6 నెలలు); కలర్ టీవీ (3 నెలలు), రిఫ్రిజిరేషన్ (6 నెలలు)… ఈ కోర్సులకు టెన్త్ పాస్, లేదా ఫెయిల్ అయినా అర్హులే. టైప్ రైటింగ్ (6 నెలలు); టెలిఫోన్ ఆపరేటర్ (45 రోజులు); సెల్‌ఫోన్ రిపేరింగ్ (6 నెలలు); షార్ట్‌హ్యాండ్(6 నెలలు); సివిల్ డ్రాఫ్ట్‌మెన్‌షిప్ (6 నెలలు); ఆర్కిటెక్చురల్ డ్రాఫ్ట్‌మెన్‌షిప్(6 నెలలు); స్పోకెన్ ఇంగ్లిష్ (3 నెలలు); జ్యువెలరీ మేకింగ్ (6 నెలలు); సర్టిఫికేట్ కోర్సు ఇన్ డ్రాఫ్ట్‌మెన్ సివిల్ (ఏడాది) మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మహిళల కోసం: మహిళలకు స్వయంఉపాధి కల్పించే విధంగా కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, జిగ్‌జాగ్, బంజారా అండ్ మిర్రర్ వర్‌‌క, ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ బ్యూటీకేర్ వంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి.

జీతాలు భారీగానే: వివిధ విభాగాల కింద సెట్విన్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 కోర్సుల వరకు నిర్వహిస్తోంది. వీటిలో అత్యధిక శాతం ప్రైవేటు రంగంలో అవకాశాలు కల్పించడంతోపాటు సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలుకల్పిస్తాయి. సెట్విన్ కోర్సుల్లో అధిక శాతం మెడికల్, హోటల్ రంగాలకు సంబంధించినవే. ముఖ్యంగా ఈ కోర్సులు ప-ర్తిచేస్తే దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సుల నుంచి ఆస్పత్రి నిర్వహణ, కంప-్యటర్ ఆపరేటర్లు, ఎక్స్‌రే, ఇతర అవయవాల స్కానింగ్ విభాగాల్లో తక్షణం ఉపాధి పొందే అవకాశం ఉంది.

దీనికి తోడు మహిళల కోసం ప్రవేశపెట్టిన బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల ద్వారా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సొంతంగా వ్యాపారం చేయడంతోపాటు ఇతరులకు శిక్షణనందించి అదనపు ఆదాయాన్ని సైతం పొందొచ్చు. చివరకు ఏడో తరగతి ప-ర్తి చేసిన వాళ్లు సైతం కార్పెంటర్లు, మేస్త్రీలుగా అవకాశాలు దక్కించుకోవచ్చు. అంతేకాదు… ఫైర్ సర్వీసులో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు ప-ర్తి చేస్తే బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు, ప్రయివేటు పారిశ్రామిక సంస్థల్లో అవసరం మేరకు మంచి జీతంతో ఉపాధి లభిస్తుంది.

స్వయం ఉపాధి:
కోర్సు ప-ర్తిచేసిన తర్వాత ఉద్యోగానికి బదులు స్వయంగా వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి గెడైన్‌‌సను కూడా సెట్విన్ అందిస్తోంది. దీని ద్వారా వివిధ మ్యానుఫ్యాక్చరిం గ్ యూనిట్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ యూనిట్లు, ఫుడ్ ప్రొడక్ట్స్, సర్వీస్ యూనిట్లు, బిజినెస్ యూనిట్లపై అవ గాహన లభిస్తుంది. తద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు.
వెబ్‌సైట్: www.setwinapgov.org

ఎంఎస్‌ఎంఈ-డీఐ (హైదరాబాద్)

దేశంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్రంలోని చిన్నతరహా పరిశ్రమల శాఖ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎంఎస్‌ఎంఈ-డీఐ)ని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ చిన్నతరహా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు చేదోడువాదోడుగా నిలుస్తోంది. పలు సెమినార్లు, వర్క్‌షాప్స్ నిర్వహించి భవిష్యత్తు వ్యాపారవేత్తలకు మెళకువలు నేర్పుతోంది. ఇందుకోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రా మ్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తోంది.

ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్:
ఈ కార్యక్రమం ద్వారా చదువుకున్న నిరుద్యోగులైన యువతీయువకులకు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి వివిధ స్వయం ఉపాధి పథకాల గురించి వివరిస్తారు. ఈ ప్రోగ్రామ్ వ్యవధి ఆరు వారాలు. పుడ్ ప్రాసెసింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ థెరపీ, స్క్రీన్ ప్రింటింగ్, మోటార్ రీవైండింగ్ అండ్ ట్రాన్స్‌ఫార్మర్ వైండింగ్, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెదర్‌గూడ్స్, కెమికల్-దాని సంబంధిత ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రిపేర్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ టూవీలర్స్, మొబైల్ ఫోన్స్ రిపేరింగ్ వంటి స్వయం ఉపాధి పథకాల గెడైన్స్ ఇస్తారు.

మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్:
చిన్నతరహా యూనిట్‌ను స్థాపించాక ఎదురయ్యే సమస్యలను అధిగమించే స్కిల్స్‌ను నేర్పడానికి ఉద్దేశించిందే మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. దీని వ్యవధి వారం నుంచి 2 వారాలు. ఇందులో ఫైనాన్షియల్, మార్కెటింగ్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, మెటీరియల్స్, క్వాలిటీ, కాస్ట్ మేనేజ్‌మెంట్‌ల గురించి శిక్షణనిస్తారు. ఇవేకాకుండా ఇంజనీరింగ్/ఐటీఐ/ఎంబీఏ కళాశాలల విద్యార్థులు, మహిళలకు, ఎస్సీ, ఎస్టీలకు ఇంటెన్సివ్ మోటివేషన్ కాంపైన్ కార్యక్రమాన్ని కూడా ఎంఎస్‌ఎంఈ అందిస్తోంది.
మరిన్ని వివరాలకు http://msmehyd.ap.nic.in/
వెబ్‌సైట్ చూడొచ్చు.

గ్రామీణ యువతకు స్వయం ఉపాధి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్
జాతిపిత గాంధీ ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్నారు. అలాంటి పల్లె ప్రజల్లో నైపుణ్యాలు మెరుగుపరచి ఉపాధి పొందేలా.. స్వయం సమృద్ధి సాధించేలా చూసే లక్ష్యంతో ఏర్పాటైందే… శ్రీ స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ (ఎస్‌ఆర్‌టీఆర్‌ఐ). నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి వద్ద జలాల్‌ప-ర్ గ్రామంలో 1995 లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వంద ఎకరాల క్యాంపస్‌లో అధునాతన పరిశోధనశాలలు, కంప-్యటర్స్, క్లాస్‌రూమ్స్, మహిళలకు, పురుషులకు ప్రత్యేక హాస్టళ్లు ఉన్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ, యువకులకు స్వయం ఉపాధిని అందించడమే ధ్యేయంగా ఈ సంస్థ పనిచేస్తోంది. ఇందుకోసం వారం వ్యవధి ఉన్న కోర్సుల నుంచి 3 నెలల వ్యవధి ఉన్న కోర్సులను సంస్థ అందిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌లో వస్తున్న మార్పులకనుగుణంగా, కంపెనీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 26 రకాల కోర్సులను అందిస్తోంది. అంతేకాకుండా వివిధ చిన్నతరహా పరిశ్రమలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ను కల్పించడమే కాకుండా.. స్వయం ఉపాధిని కోరుకునేవారికి గెడైన్స్‌ను కూడా ఇస్తోంది. వీటితోపాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా శిక్షణనిస్తోంది.

About the Author