షిర్డీలో ప్రమాదం: తాడిపత్రివాసులకు గాయాలు
షిర్డీలో ఓ ప్రైవేట్ బస్సు మంగళవారం ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే బాధితులు అందరిది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రి స్వస్థలమని షిర్డీ పోలీసులు తెలిపారు. వాహనాల ఢీ కన్న ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు షిర్డీ పోలీసులు పేర్కొన్నారు.