శాంతిని కొనసాగిస్తాం : భారత్, చైనా ప్రకటన
వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సుస్థిరతలను కొనసాగించడానికి ఉమ్మడిగా కృషి చేస్తామని భారత్, చైనాలు పేర్కొన్నాయి. పరస్పర విశ్వాసాన్ని పాదుకొల్పడానికి వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకోల్సిన అవసరముందన్నాయి. సంయుక్త సైనిక విన్యాసాలను పునరుద్ధరించడానికి అంగీకరించాయి. చైనాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ శుక్రవారం చైనా ప్రధాని లీ కెకియాంగ్, రక్షణ మంత్రి వాంక్వాన్‌లోతో చర్చలు జరిపారు.