Published On: Fri, Nov 29th, 2013

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రివ్యూ ….

Share This
Tags

పాత సినిమాల లాగానే ఒక రైలు ప్రయాణాన్ని తీసుకొని దర్శకుడు గాంది చక్కగా తెరకెక్కించాడు.విషయం పాతది అయునా చిత్రీకరించిన విదానం బాగుంది.ఎలాగయితేనేమి సురక్షితంగా రైలుని గమ్యానికి చేర్చాడు..కొత్త దర్శకుడు అయినా పెద్దగా తడబడకుండా ఎంటర్టైన్మెంట్ ని పండించుకుంటూ సాధ్యమైనంత వేగంగా ఎక్స్ ప్రెస్ ని నడిపి సేఫ్ గా డెస్టినేషన్ ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసారు. ఓ అబ్బాయి, అమ్మాయి… ట్రైన్ జర్నీ ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. అలాంటి బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకుని ఓ పాత పాయింట్ ని కొత్త గా చెప్పటానికి ప్రయత్నించాడు దర్శకుడు సెకండాఫ్ లో సీన్స్ లెంగ్త్ ఎక్కువ అయ్యి..ట్రాక్ మారినా..ఓవరాల్ గా మొత్తానికి చేరవలిసిన స్టేషన్ కే వచ్చాడు. అల్లరి నరేష్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో సందీప్‌ (సందీప్‌ కిషన్‌) సగటు తెలుగు సినీ హీరోలా తన కళ్లెదురుగాఅన్యాయం జరుగుతూంటే సహించలేడు. అయినదానికీ,కానిదానికి ప్రతీ విషయంలో తలదూర్చే అతనంటే తండ్రి రామ్మూర్తి(నాగినీడు)కి నచ్చదు. ఆయన శిశుపాలుడిలా వంద తప్పుల వరకే పరిమితి ఇచ్చారు. ఆల్రెడీ సందీప్ తొంభై తొమ్మిది తప్పులు చేసేశాడు. మిగిలిన ఒక్క తప్పు చేయకుండా ఎలా తప్పించుకోవాలి అనుకున్న సమయంలో అతను తన సోదరుడు (బ్రహ్మాజీ) పెళ్లికి తిరుపతి కి సకుటుంబ సమేతంగా బయిలు దేరతాడు.

చెప్పుకోవడానికి మావయ్య ఛోటా కె నాయుడు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయినప్పటికీ… ప్ర‌తిభ‌ను మాత్రమే న‌మ్ముకొన్న హీరో సందీప్ కిష‌న్‌. `ప్ర‌స్థానం` చిత్రంలో చేసింది నెగెటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఎదిగేందుకు విభిన్నమైన చిత్రాలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ గురించి గొప్పగా చెప్పాడు. బడ్జెట్ పరంగా…టెక్నీషియన్స్ పరంగా చూస్తే సందీప్ కి ఇది నిజంంగా స్పెషల్ సినిమానే. ఇప్పటివరకు నటుడిగా నిరూపించుకునేందుకు దోహదం చేసే చిత్రాలే చేస్తూ వచ్చిన సందీప్ తొలిసారిగా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమాతో తన మార్కెట్ కూడా పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తూ వచ్చాడు.

ఈ సినిమాపై అంచనాలు పెరిగేందుకు దోహదం చేసిన అంశాలు చాలానే ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. సందీప్ కు ఛోటా మావయ్య అనే విషయం తెలిసిందే. గౌతం రాజు ఎడిటింగ్, రమణ గోగుల మ్యూజిక్, రకుల్ అందాలు, దర్శకుడు మేర్లపాక గాంధి ప్రముఖ రచయిత మేర్లపాక మురళి తనయుడు కావడం…. ఇలాంటి విషయాలన్నీ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి అలాంటి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో అసలేం జరిగింది. సందీప్ కెరీర్ కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందా… పేరుకు తగ్గట్టే ఎక్స్ ప్రెస్ వేగంతో దూసుకెళ్లిందా…లేక ప్యాసింజర్ లా నత్తనడక నడిచిందా అనేది తెలుసుకోవాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే.

ఆ ప్రయాణంలో అతనికి వందవ తప్పు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ ప్రయాణంలోనే ప్రార్థన (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) పరిచయమవుతుంది. ఆమె చాలా ప్రాక్టికల్ …లెక్కల మనిషి. ఇద్దరి గమ్యం ఒక్కటే. తిరుపతి వెళ్లాలి. కానీ కారణాలు వేరు. ఈ రైలు ప్రయాణం అతని జీవితాల్ని ఎలా మలుపు తిప్పింది? 100 వ తప్పు చేయకుండా తప్పించుకున్నాడా..ఏం తిప్పలు పడ్డాడు అనేదే ఈ చిత్ర కథ. దర్సకుడు కొత్త వాడైనా స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ముఖ్యంగా మొదట్లోనే..హీరో 100 వ తప్పు చేస్తాడా..లేదా అన్న పాయింట్ తో హుక్ చేసి సినిమా చివరి వరకూ అదే పాయింట్ ని దృష్టిలో పెట్టుకుని సీన్స్ వేయటం కలిసి వచ్చింది. ఇక హీరోయిన్ పాత్ర మరీ రెగ్యులర్ గా కాకుండా చేయటంతో సీన్స్ బాగా వచ్చాయి. అయితే కొన్ని చోట్ల కామెడీ కోసం అనవసరంగా సీన్స్ క్రియేట్ చేయటంతో అవి పండక విసుగెత్తించాయి. అయితే దర్శకుడు ..నటీనటుల నుంచి సహజమైన నటన తీసుకోవటం కలిసి వచ్చింది. ఎంత కష్టపడినా హీరోయిన్ నుంచి మాత్రం ఎక్సప్రెషన్స్ రాబట్టలేకపోయాడు. యాక్షన్ ఎపిసోడ్స్ సైతం సరిగా డీల్ చేయలేకపోయాడు. క్లైమాక్స్ సైతం తేలిపోయింది. ఫస్టాఫ్ లో ఉన్న స్పీడు, ఎంటర్టైన్మెంట్ సెకండాఫ్ లో కొరవడింది.

కధ:
రామ్మూర్తి(నాగినీడు) ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్. స్కూల్లో పిల్లలు ఎంత క్రమశిక్షణగా ఉండాలంటారో అదే రేంజ్ లో మన రామ్మూర్తి ఇంట్లో కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. 100 తప్పులు చేసిన శిశుపాలున్ని శ్రీ కృష్ణుడు చంపేసినట్టు రామ్మూర్తి కూడా తన కుటుంబం కోసం ఓ కుటుంబ రాజ్యాంగం రాస్తాడు. దాని ప్రకారం ఇంట్లో ఎవరన్నా 100 తప్పులు చేస్తే వారిని ఇంట్లోనుంచి బయటకు పంపేస్తాడు. అలాంటి స్ట్రిక్ట్ రామ్మూర్తి చిన్న కొడుకే మన హీరో సందీప్(సందీప్ కిషన్). సందీప్ కి ఏమో తన కళ్ళముందు ఎక్కడ ఏ చిన్న గొడవ జరుగుతున్నా తల దూర్చడం అలవాటు. మరి అలాంటప్పుడు సందీప్ చేసే తప్పులు పెరిగిపోతాయి కదా.. అలా సందీప్ 99 తప్పులు పూర్తవుతాయి. ఇంకో తప్పు చేస్తే ఇంట్లో నుంచి తరిమేస్తానని రామ్మూర్తి వార్నింగ్ ఇస్తాడు.
అప్పుడే సందీప్ అన్న అయిన బ్రహ్మాజీ (బ్రహ్మాజీ) పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం అందరూ హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుపతికి బయలుదేరుతారు. ఆ జర్నీలో, పెళ్ళిలో సందీప్ తన 100వ తప్పు చేయకుండా ఉండటానికి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? చివరికి 100వ తప్పు చేసాడా? లేదా? అసలు ఈ జర్నీలో హీరోకి ప్రార్ధన(రాకుల్ ప్రీత్ సింగ్)కి ఎలా పరిచయమైంది? అసలు ప్రార్ధన ఎవరు? అసలు చివరికి బ్రహ్మాజీ పెళ్లి జరిగిందా? లేదా? అనేది మీరు తెరపైనే చూడాలి…

ప్లస్ పాయింట్స్ :
సందీప్ కిషన్ నటన బాగుంది. సందీప్ కిషన్ సోలో హీరోగా చేసిన ఈ రెండవ సినిమా ద్వారా నటనపరంగా కాస్త మెరుగయ్యాడు. మొదటిసారి సందీప్ కిషన్ ఈ సినిమాలో డాన్సులు బాగా చేసాడు. రాకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బాగుంది. ‘మెలమెల్లగా’ పాటలో రాకుల్ ప్రీత్ సింగ్ ని చాలా గ్లామరస్ గా కనిపించింది. హీరోయిన్ ది చెప్పుకోదగిన పాత్ర కాకపోయినా మంచి మార్కులే కొట్టేసింది.
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. ముఖ్యంగా తాగుబోతు రమేష్ చేసిన ఆణిముత్యం పాత్ర దాదాపు సినిమా మొత్తం ట్రావెల్ అవుతూ ప్రేక్షకులను నవ్విస్తుంటాడు. అలాగే నెల్లూరు సప్తగిరి చేత చేయించిన దస్తగిరి ఫ్రం వెంకటగిరి ట్రాక్ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది. ట్రైన్ లో అతనిచేత చేయించిన ఎపిసోడ్స్ అన్ని బాగా నవ్వు తెప్పిస్తాయి.
బ్రహ్మాజీ పెళ్లి కోసం ఎంతగానో ఎదురుచూసే పాత్రని బాగా చేసాడు. స్ట్రిక్ట్ ఫాదర్ రామ్మూర్తి పాత్రలో నాగినీడు నటన బాగుంది. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఇలాంటి సింపుల్ కాన్సెప్ట్ సినిమాలను ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యడం కాస్త కష్టమైన విషయం కానీ డైరెక్టర్ చాలా తెలివిగా ఎంటర్టైన్మెంట్ ని మిక్స్ చేసి బాగా డీల్ చేసాడు.

మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. సెకండాఫ్ లో ఎం.ఎస్ నారాయణ చేసిన థ్రిల్ మాస్టర్ పాత్ర బాగోలేదు. జయప్రకాశ్ రెడ్డి పాత్ర కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు.
సినిమా ఫస్ట్ హాఫ్ సాగింతంత వేగంగా సెకండాఫ్ ఉండదు. అలాగే సెకండాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గడంతో పాటు కాస్త ఊహాజనితంగా తయారవుతుంది. సినిమాని అక్కడక్కడా సాగదీశారు. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ సినిమాల్లో క్లైమాక్స్ లా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుంది. కానీ ఆ సినిమాల స్థాయిలో లేదు.

సాంకేతిక విభాగం :
సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జర్నీలో ఎక్కువ భాగం సాగే ఈ సినిమాలోని ప్రతి ఫ్రేం కలర్ఫుల్ గా ఉండేలా చోటా కె నాయుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. రమణ గోగుల అందించిన పాటలు బాగున్నాయి, అలాగే సినిమాకి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ విషయంలో ఎడిటర్ ని ఏమీ అనడానికి లేదు కానీ సెకండాఫ్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.
ఈ సినిమాకి కీలకమైన కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం అనే కీలకమైన విభాగాలను మేర్లపాక గాంధీ డీల్ చేసాడు. ఈ యంగ్ డైరెక్టర్ లో విషయం ఉంది అనేది మనకి ఫస్ట్ హాఫ్ చూడగానే అర్థమవుతుంది. కథ – చాలా సింపుల్ పాయింట్, స్క్రీన్ ప్లే – చాలా తెలివిగా రాసుకున్నాడు.. ఫస్ట్ హాఫ్ లో ఉపయోగించినంత తెలివిని సెకండాఫ్ లో కూడా ఉపయోగించి ఉంటే బాగుండేది. మాటలు – కామెడీ ట్రాక్స్ కి మాత్రం సూపర్బ్ గా రాసాడు. కానీ క్లైమాక్స్ సీన్స్ కి మాత్రం ఇంకాస్త ఎఫ్ఫెక్టివ్ గా ఉండాల్సింది. ఇక చివరిగా డైరెక్షన్ – నటీనటుల అందరి నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు. ఓవరాల్ గా డైరెక్టర్ గా గాంధీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే జెమిని కిరణ్ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా, సెకండాఫ్ ఏమో జస్ట్ ఎక్స్ ప్రెస్ లా సాగుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసింది. సినిమా కోసం ఎంచుకున్నది చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ డైరెక్టర్ దానిని చాలా బాగా డీల్ చేసాడు. ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయితే సెకండాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం, ఎమోషనల్ సీన్స్ సరిగా లేకపోవడం ఈ సినిమాలో చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఓ సారి చూడదగిన సినిమా.

నటీనటుల్లో సందీప్ కిషన్ బాగా చేసాడు. హీరోయిన్ మొహంలో పెద్దగా ఎక్సప్రెషన్స్ పలకకపోవటంతో ఆమె కోసం డిజైన్ చేసిన క్యారక్టరైజేషన్ సైతం పలకలేదు. సప్త గిరి బాగా కామెడీ పండించారు. ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మాజి వంటి సీనియర్స్ షరా మూమూలే. రమణ గోగుల సంగీతం లో రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకికి పెద్ద ప్లస్ పాయింట్. ఎడిటింగ్ మరింత లా లాగ్స్ తగ్గించి కోత పెట్టాల్సింది. ఓ ఇరవై నిముషాల మేర సినిమాను ఎడిట్ చేసి మరింత షార్ప్ గా మారిస్తే బాగుండేది. ఫైనల్ గా ఈ చిత్రం దర్శకుడుకి మరో సినిమా తెప్పించే సేఫ్ ప్రాజెక్టు అయ్యే అవకాసం ఉంది. మీడియం బడ్జెట్టు,టాక్ బాగుంది కాబట్టి కొనుక్కున్న వారికి నష్టం రాకపోవచ్చు. సందీప్ కిషన్ ఈ సినిమాతో మరింత అలవాట పడి…ఆగిపోయిన అతని మిగతా సినిమా రిలీజ్ అవుతాయి. టోటల్ గా అందిరిని ఈ ఎక్స్ ప్రెస్ సేఫ్ గా తీసుకువెళ్ళింది.

About the Author