Published On: Sun, Apr 20th, 2014

లడ్డుబాబు రివ్యూ……

Share This
Tags

కథ :
చాలా లావుగా ఉన్న లడ్డుబాబు (అల్లరి నరేష్) తన తండ్రి కిష్టయ్య (కోట శ్రీనివాస్ రావు)తో కలిసి నివసిస్తుంటాడు. లావుగా ఉన్న కారణంగా ‘లడ్డు బాబు’ ప్రజలు నుండి తీవ్ర అవమానాలు ఎదురుకుంటున్నాడు, కానీ తను అన్నిటిని ఓపికగా బరిస్తాడు. కిష్టయ్యకు తన పూర్వికుల ఆస్తి ఒకటి ఉంటుంది, కానీ దాన్ని తను లడ్డుబాబు పెళ్లి అయితే కానీ అమ్మలేడు. కిష్టయ్య ఎంత ప్రయత్నించిన కూడా లాడ్డుబాబుకు పెళ్లి చేయలేకపోతాడు.
మరో వైపు లడ్డుబాబు మూర్తి అనే ఒక చిన్న పిల్లవాడితో స్నేహం చేస్తాడు. తను మూర్తికి అతని తల్లి(భూమిక)కి దగ్గర అవుతాడు. అనుకోకుండా లడ్డుబాబు మాయ (పూర్ణ) అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. కానీ మాయకు తనంటే ఇష్టం లేదు అని తెలుసుకుని భాధపడుతాడు. ఎలాగైనా తను సన్నబడాలని, దానికోసం ఏదైనా చేయటానికి సిద్ధం అవుతాడు లడ్డుబాబు. మూర్తి అనే చిన్న పిల్లవాడు లడ్డుబాబుకు ఎందుకు దగ్గర అవుతాడు ? లావు తగ్గడానికి లడ్డుబాబు ఎం చేస్తాడు?…ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే…
ప్లస్ పాయింట్స్ :
‘లడ్డుబాబు’గా మంచి నటన కనబరిచాడు అల్లరి నరేష్. సినిమా మొత్తం తన భుజాల మీద నడపడానికి తీవ్ర కృషి చేశాడు. మాయ పాత్రలో పూర్ణ పర్వాలేదు అనిపించింది. భూమిక తల్లి పాత్రలో చాలా అధ్బుతంగా నటించింది. ఈ సినిమాకి భూమిక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఎండ్ టైటిల్స్ లో వచ్చిన వేణు మాధవ్ సన్నివేశాలు సినిమాలో ఉండి ఉంటే బాగుండేది. నరేష్ తండ్రిగా కోట శ్రీనివాస్ రావు నటన పర్వాలేదు అనిపించేలా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
లడ్డుబాబు సినిమాలో ఎలాంటి కథ లేదు. సినిమా మొత్తం అర్ధం పర్దం లేకుండా ఉంటుంది. దోమ కాటు వలన నరేష్ లావు అవుతాడు అని సినిమా మొదట్లో చెబుతారు. కానీ నరేష్ లావు తగ్గాక, తనకు ఒక అరుదైన వ్యాధి ఉందని దాని వలన తన రక్త కణాలలో ఏర్పడే మార్పు వలన తను లావు అయ్యాడని చెబుతారు. మరి దోమ ఎక్కడికి పొయింది? ఓక చిన్న పిల్లవాడు ఎక్కడైనా తన తల్లికి ఒక లావు ఉన్న లడ్డుబాబు భర్తగా రావాలని కోరుకుంటాడా? ఇలాంటి అర్ధం లేని సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి.
అల్లరి నరేష్ సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే కామెడీ ఈ సినిమాలో ఉండదు. అల్లరి నరేష్ మార్క్ కామెడీ ఉంటుందని వచ్చే ప్రేక్షకులు మాత్రం నిరుత్సాహ పడక తప్పదు. సినిమా చాలా సాగదీసిన్నట్టు ఉంటుంది. ఒవారల్ గా సినిమాలో ఒక 30 నిమిషాలు కట్ చేస్తే బాగుండే అవకాశం ఉంది.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. చక్రి పాటలు కూడా ప్రేక్షకులని అక్కట్టుకోలేవు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదో ఉంది అంటే ఉంది అనేలా ఉంటుంది. డైలాగ్స్ లో ఎలాంటి పంచులు లేవు. రవిబాబు అన్ని సినిమాలలో కనిపించే సాంకేతిక విలువలు ఈ సినిమాలో లేవు. పసలేని దర్శకత్వంతో ప్రేక్షకులని నిరుత్సహపరిచాడు.
తీర్పు :

నిరుత్సాహపరిచిన ‘లడ్డుబాబు’ బాక్స్ ఆఫీసు దగ్గర నిలదొక్కుకోలేదు. ప్రేక్షకులు సహజంగా అల్లరి నరేష్ సినిమా అంటే సినిమా వేగంగా ఆద్యంతం నవ్వుకునే విధంగా ఉంటుందని ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో అవి ఏవి ఉండవు. సినిమాలో ఎలాంటి కథ లేక పోవడం, దానికి అర్ధం పర్దం లేని స్క్రీన్ ప్లే తోడవడంతో థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు.

About the Author