Published On: Sat, Mar 30th, 2013

రామ్ చరణ్ చిత్రానికి నేను చేయటం లేదు: దేవిశ్రీ ప్రసాద్

Share This
Tags

రామ్ చరణ్ తాజా చిత్రం ‘తుఫాన్’ సంగీతంపై ఉన్న కన్ఫూజన్స్ తొలిగిపోయాయి. తాను ‘తుఫాన్’ లేదా ‘జంజీర్’ చిత్రానికి సంగీతం ఇవ్వలేదని దేవి ట్వీట్ చేసారు. చాలా మంది తనని పదే పదే ఇదే ప్రశ్న అడటంతో క్లారిఫై చెయ్యక తప్పలేదని చెప్పారు. అనూ మాలిక్, మీట్ బ్రదర్శ్, కాధరిన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మొదట్లో దేవినే ఈ చిత్రానికి సంగీతం అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబ్ హీరోగా 1973లో వచ్చిన ‘జంజీర్’చిత్రం హిట్ కావడంతో… అదే సినిమాను ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. సమ్మర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబ్ అభిమానుల కోరిక మేరకు ‘జంజీర్’ చిత్రంలో ఆయనతో గెస్ట్ రోల్‌ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ జంజీర్ వరకు మాత్రమే అమితాబ్ గెస్ట్ రోల్ పరిమితమని, తెలుగు వెర్షన్ ‘తుఫాన్’ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.

About the Author

-