రాజీనామాకు సిద్ధపడ్డ కేరళ సీఎం ఒమెన్ చాందీ
కేరళ ముఖ్యమంత్రి ఒమెన్ చాందీ రాజీనామాకు సిద్ధపడ్డారు. సౌరశక్తి పరికరాల కుంభకోణంలో ముఖ్యమంత్రి కార్యాలయం హస్తం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య గత రాత్రి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక సోలార్ కుంభకోణం ఏకంగా ముఖ్యమంత్రి ఒమెన్‌చాందీ మెడకే చుట్టుకుంది. ఓ ప్రైవేట్ బోగస్ సోలార్ కంపెనీకి చెందిన వ్యక్తులతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహిత సంబంధాలు కలిగి వుంటూ నిబంధనలకు నీళ్ళొదిలి అడ్డగోలుగా కాంట్రాక్టులు అప్పగించడం ద్వారా ఆ కంపెనీకి పెద్దయెత్తున అనుచిత లబ్ధి చేకూర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.