మే 10 న విడుదలకానున్న “ఇద్దరమ్మాయిలతో’
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “ఇద్దరమ్మాయిలతో’ సినిమా స్పెయిన్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా క్యాథరిన్, అమలాపాల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మే 10 న విడుదల చేయనున్నారన్న ఈ విషయాన్ని బండ్ల గణేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు .
ఈ మద్య పూరి జగన్నాథ్ ఈ సినిమా అత్యాదునిక హంగులతో నిర్మిచడం కోసం టెక్నికల్ యూనిట్ సభ్యులను మార్చారు.