Published On: Tue, Jun 25th, 2013

ముషార్రఫ్ ‘దేశద్రోహం’ ఎదుర్కోవాల్సిందే: నవాజ్

Share This
Tags

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ దేశద్రోహ నేరంపై విచారణను ఎదుర్కోవాలసిందే అని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. దేశ రాజ్యాంగాన్ని రెండుసార్లు అతిక్రమించిన ముషార్రఫ్ దేశద్రోహానికి పాల్పడ్డారని చెప్పారు. దేశద్రోహ నేరానికి సంబంధించి ముషార్రఫ్ ప్రతి చర్యనూ విచారణ పరిధిలోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు నవాజ్ షరీఫ్ సోమవారం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు.

పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చిన 66 ఏళ్లలో దేశద్రోహం నేరంపై విచారణ ఎదుర్కోనున్న మొట్టమొదటి సైనికాధ్యక్షుడు ముషార్రఫే. ఒకవేళ ముషార్రఫ్‌పై దేశద్రోహం నేరం రుజువైతే ఆయనకు మరణశిక్ష లేదా యావజ్జీవ ఖైదు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్న ముఫార్రఫ్ సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, తన ప్రతి చర్యకూ ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 1999లో సైనిక తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోసి ముషార్రఫ్ అధికారం చేజిక్కించుకున్నారని, 2007లో రాజ్యాంగాన్ని అతిక్రమించి దేశంలో ఎమర్జెన్సీ విధించారని పార్లమెంటుకు తెలిపారు.

About the Author