Published On: Mon, Mar 11th, 2013

మీ గుండెను సురక్షితంగా ఉంచే టాప్ 15 ఫుడ్స్…!

Share This
Tags

ఆధునిక జీవనశైలిలో అధిక బరువు, మధుమేహం, రక్తపోటు సహజ రుగ్మతలుగా మారిపోయాయి. వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు చిన్నవయస్సులోనే ఆవహిస్తున్నాయి. జీవనశైలి, ఆహార నియమాలు, మానసిక ఒత్తిళ్లే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. రుగ్మత ఏదైనప్పటికి దాని ప్రభావం గుండెపై పడుతుంది. రక్తపోటు పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గుండెను పదిలపర్చుకోడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిష్టులు.

సాధారణంగా మనం తీసుకునే ఆహారం శరీరం సక్రమంగా పని చేయడానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఇంధనంలా పని చేస్తుంది. ఆహారం మన శరీరానికి మూడు విధాలుగా ఉపయోగపడుతుంది. అవి శరీర నిర్మాణానికి, శక్తిని చేకూర్చడానికి, శరీర కార్యక్రమాలను క్రమబద్ధీకరించడానికి. మన శరీరం పని చేయడానికి ఆహారం, నీరు అతి ముఖ్య మైన పోషకావసరాలు. మన శరీరంలోకి ప్రవేశించే ప్రమా దకరమైన బాక్టీరియాతో పోరాటం సల్పటానికి, శరీరానికి అవసరమైన నీటి సమతుల్యతను కాపాడటానికి, ఇతర శరీర ధర్మాల నిర్వహణకు ఆహారం ద్వారా లభించే రసాయనాల అవసరం ఎంతో ఉంది.

కొన్ని ఆహారాల్లో ఎక్కువగానూ, మరికొన్నింటిలో తక్కువగానూ పోషక విలువలు ఉంటాయి. అలాగని ఏ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు. మనం ఎంత తింటున్నామనేది మాత్రమే కాదు, ఏం తింటు న్నామనేది కూడా ముఖ్యమే. అన్ని రుచులు, పదార్థాలు కలిస్తేనే సంపూర్ణ ఆహారం అవుతుంది. కొన్ని పదార్థాలు కళ్లను కాపాడుకుంటే మరికొన్ని బలాన్నిస్తాయి. ఇంకొన్ని శరీరంలోని ఇతర భాగాలకు మంచి చేస్తాయి.

రెడ్ వైన్: రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు.

సీఫుడ్/చేపలు: సాల్మన్ చేపల్లో వుండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ నరాల్లో రక్త సరఫరాను క్రమబద్ధం చేస్తాయి.గుండె ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. ఇవి శరీరంలో ఇమ్యునిటీ శక్తిని కూడా పెంపొందిస్తాయి. గుండెకు మంచి చేసే కొవ్వును పెంపొందిస్తాయి. అంతేకాదు శరీరంలో రక్తం గడ్డకట్టకుండా వుండేందుకు ఇది ఎంతో అవసరం.

ఆలివ్ ఆయిల్: ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి.ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.

వాల్ నట్: వీటిలో పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. విటమిన్ బి 1,2,3,6 మరియు ఇ, మినరల్స్ అయిన కాపర్, జింక్, కాల్షియం, మేంగనీస్, ఐరన్ వంటివి కూడా వుండి బ్లడ్ షుగర్ స్ధాయిలను నియంత్రిస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధిక కొల్లెస్టరాల్ ను నియంత్రించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్ నట్ ను ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

బాదాం: ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. విటమిన్ ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ ప్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది అప్పుడు అందులోని ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది.

టోఫు: కాటేజ్ చీజ్ కు బదులుగా ఈ సోయాబీన్స్ తో తయారు చేసే చీజ్ లాంటి పదార్థాన్ని టోఫు అంటారు. ఇందులో కూడా కాల్షియం శాతం ఎక్కువే. టోఫు లో కొవ్వు తక్కువ, పీచు, ప్రొటీన్లు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు అధికం. మంచి శక్తినిస్తుంది. జస్ట్ ఒక కప్పు కాటేజ్ చీజ్ లో 28గ్రాముల ప్రోటీనులు కలిగి ఉన్నాయి.

స్వీట్ పొటాటో: శరీరానికి అవసరమయ్యే న్యూటియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి మజిల్ గ్రోత్ కు బాగా సహాయపడుతాయి. కాబట్టి ఈ రుచికరమైన, శక్తినందించే స్వీట్ పొటాటోను మీ డైలీ డయట్ లో చేర్చుకోండి. అంతే కాదు ఇందులో ఉండే విటమిన్స్, మినిరల్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ సేపు ఆకలి కలగకుండా కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇందులో గ్లిసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహగ్రస్తులకు, గుండె సమస్యలకు నివారణకు సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు: నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది.

క్యారెట్: రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతూ కొవ్వుని కరిగించే లక్షణాలను దీనిలో అధికంగా ఉంటాయి. క్యారెట్, టోమాటో, ఆకుకూరల సలాడెలతోనూ ప్రయోజనాలు అధికం. రోజూ ఒక పచ్చి క్యారెట్‌ తినడం వల్ల శరీరంలోని చెడుకొవ్వు తగ్గి, రక్తపీడనం సరైన స్థాయికి చేరుకోవడమే కాక, తద్వారా గుండె జబ్బులు నివారింపబడతాయి.

బార్లే: బ్లడ్ షుగర్ స్ధాయిలను చక్కగా నియంత్రిస్తాయి. వీటిలో ఫైబర్, ఎమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ అధికంగా వుంటాయి. కొల్లెస్టరాల్ స్ధాయిలను బాగా తగ్గిస్తుంది. ఆరోగ్యమే కాదు కడుపు కూడా ఈ ఆహారం నింపుతుంది.

ఓట్స్: ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

ఫ్లాక్స్ సీడ్స్: అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్. అవిసెలో ఒమెగా-3 ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. గుండెజబ్బుల నివారణ కోసం, అధిక రక్తపోటును తగ్గించడానికి, డయాబెటిస్‌ను నివారించడానికి అవి ఎంతగానో తోడ్పడే ఈ అవిసె గింజలు బరువు తగ్గించడానికి కూడా ఉపయోగపడుతాయి.

కాఫీ: కాఫీ గుండెకు మంచిది. చాలామంది రీసెర్చర్లు, తగు మాత్రంగా అంటే రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు కాఫీ తీసుకుంటే గుండెకు ఆరోగ్యం అని చెపుతారు. కాఫీ గుండె సంబంధిత వ్యాధులు అరికడుతుంది. కాఫీలో వుండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలలో మంటలను అరికట్టి రక్త సరఫరా మెరుగుపరుస్తాయి. కాఫీ తాగిన వెంటనే మీలో రక్తపోటు, గుండె కొట్టుకునే రేటు పెరుగుతాయి. అయితే దీర్ఘకాలంలో మీ ఈ స్ధాయిలు యాంటీ ఆక్సిడెంట్లలో వున్న నైట్రిక్ యాసిడ్ కారణంగా నియంత్రించబడతాయి.

చెర్రీ: చూడటానికి చిన్నగా..పుల్లగా ఉండే ఈ చెర్రీస్ మరో లో గైసిమిక్ ఇండెక్స్ ప్రూట్. శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గించే ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది.

About the Author