Published On: Mon, Aug 5th, 2013

మహిళా హాకీ జట్టుకు మోడీ అభినందనలు

Share This
Tags

జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన భారత జట్టును బీజేపీ నాయకుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ‘అభినందనలు… ఇదో చారిత్రక ఘట్టం’ అంటూ ట్విటర్లో మోడీ పోస్ట్ చేశారు. జూనియర్ మహిళల హాకీ జట్టుకు లోక్సభ కూడా అభినందలు తెలిపింది.

జర్మనీలోని మొన్‌చెన్‌గ్లాడ్‌బాచ్లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-2తో ఇంగ్లండ్‌ను ఓడించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోరు 1-1తో సమం కావడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.

కాంస్య పతకం గెలిచిన భారత జూనియర్ జట్టు సభ్యులకు ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు పురస్కారాన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించింది. కోచ్ నీల్ హావ్‌గుడ్‌కు రూ.లక్ష, సహాయ సిబ్బందికి రూ. 50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు హెచ్‌ఐ కార్యదర్శి బాత్రా తెలిపారు.

About the Author