Published On: Thu, Feb 28th, 2013

మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చిన రాఘవ లారెన్స్.!

Share This
Tags

కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఒక సినిమా తీస్తున్నాడు అంటే స్టొరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కొరియోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాలు తనే చేసేసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగానే ముందుగా తీసుకున్న టీం సినిమా పూర్తయ్యే టైంకి మార్చేసి వాళ్ళ పని కూడా లారెన్స్ చేసేస్తుంటాడు. లారెన్స్ తీసిన ‘రెబల్’ సినిమా విషయంలో కూడా ముందుగా అనుకున్న హీరోయిన్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేశాడు. అలాంటి లారెన్స్ ప్రస్తుతం తను గతంలో తీసిన ‘ముని’, ‘కాంచన’ హిట్ సినిమాలకు సీక్వెల్ గా ‘ముని -3′(వర్కింగ్ టైటిల్) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి కూడా లారెన్స్ టీంని మార్చడం మొదలు పెట్టాడు.

‘ముని -3′ కి ముందుగా విజయ్ అంథోని ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాడు కానీ ఇప్పుడు లారెన్స్ కి ఏమైందో గానీ అతన్ని తీసేసి ‘కొలవెరి డీ’ సాంగ్ తో ఫేమస్ అయిన అనిరుధ్ ని తీసుకున్నాడు. ఈ విషయాన్ని అనిరుధ్ ని అడిగితే ‘ అవును, ఈ ‘ముని -3′కి మ్యూజిక్ అందిస్తున్నాను. లారెన్స్ ని కలిసాను, ఆయన కథ నాకు బాగా నచ్చడంతో ఓకే అన్నాను. ఈ హిట్ సీక్వెన్స్ మూవీలో నేను ఒక భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందని’ అనిరుధ్ అన్నాడు. సెట్స్ పై ఉన్న ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు – తమిళ భాషల్లో ఒకేసారి తీస్తున్నారు. ఇక సినిమా పూర్తయ్యేటప్పటికి ఇంకెంతమంది మారిపోతారో? చూడాలి మరి

About the Author