Published On: Sat, Mar 22nd, 2014

భీమవరం బుల్లోడు రివ్యూ….

Share This
Tags

భీమవరంలో ఉండే రాంబాబు(సునీల్) ఒక ఆరోగ్య సమస్యతో రాంబాబు హాస్పిటల్‌కు వెళ్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ, పది రోజుల కంటే ఎక్కువ బతకడనీ డాక్టరు(ఆహుతి ప్రసాద్) చెబుతారు. దాంతో బతికే కొద్ది రోజులైనా ఏదైనా మంచి పని చేసి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు రాంబాబు. ఊళ్లో ఉంటే సానుభూతి తట్టుకోలేమని సిటీకి వస్తాడు. అక్కడవారికి మంచి చేసే ప్రాసెస్ లో … ఎవడైతే నాకేంటి అంటూ గూండాలను ఏరేస్తాడు. ఈ లోగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ లేదనే నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి ప్రాణ భయం పట్టుకుంటుంది. ఈలోగా అతని చేతిలో దెబ్బ తిన్న గూండాలు వెనకపడతారు. అప్పుడేం జరిగింది అనేది మిగతా కథ. అలాగే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఏమిటి…ఆ లవ్ స్టోరీ ఏమిటీ తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే. “సినిమా క్లైమాక్స్ ముందే తెలిస్తే ఎంత బోరింగ్ గా ఉంటుందో” అంటూ ఈ చిత్రంలో ఓ డైలాగు ఉంటుంది. ఆ డైలాగుని అనుసరిస్తున్నట్లుగా ఈ చిత్రం కథ కూడా సినిమా ప్రారంభమైన పది నిముషాలకే పూర్తిగా సాధారణ ప్రేక్షకుడికి అణువణువు అర్దమయ్యే స్క్రీన్ ప్లే తో తయారు చేసారు. దాంతో ఏ ఒక్క సీన్ లోనూ తర్వాతేం జరుగుతుందనే ఆసక్తి ఉండకుండా పోయింది. అలాగని దర్శక,నిర్మాతలు నమ్ముకున్న కామెడీనీ పేలలేదు. అక్కడికీ మెయిన్ ప్లాట్ Short Time (1990) నుంచీ, Good Luck Chuck (2007)నుంచి హీరోయిన్ ట్రాక్ ఎత్తుకొచ్చారు. రకరకాల సినిమాల నుంచి మిగతా కామెడీ సీన్స్ లేపి కథలో కలిపారు. కానీ అసలు కథలో విషయం లేకపోవటంతో తేలిపోయింది. కొంత కాలం క్రితం సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమాభిషేకం …వీడికి కాన్సర్ లేదు(వేణు మాధవ్ హీరో) చిత్రం కూడా ఇదే ప్లాట్. అలాగే గతంలో బాబూ మోహన్ సైతం ఓ చిత్రం కథని పేరడీగా చేసేసారు. ఇలా ఎన్నో సార్లు ప్రేక్షకుడుకి తెలిసిన ఈ స్టోరీ లైన్ ని లో కొత్త ట్విస్ట్ లు ఏమన్నా కలిపితే చూడటానికి బాగుండేది. అలాంటిదేమీ లేకుండా ఈ మాత్రం చాలు అన్నట్లుగా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ ప్రేక్షకుడు మీదకు వదిలింది.

About the Author