బెంగాల్ లో ఎన్నికల హింస: ముగ్గురి మృతి
పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస ముగ్గురు కార్యకర్తల ప్రాణాలు తీసుకుంది. పోలింగ్ మొదలవగానే అక్కడ వాతావరణం వేడెక్కింది. టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. బురుద్వార్ పోలింగ్ బూత్‌పై జరిగిన బాంబుల దాడిలో ఇరు పార్టీలకు చెందిన ముగ్గురు కార్యకర్తలు మృతి చెందారు. మృతులలో సిపిఎం తరఫున పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త కూడా ఉన్నారు.
ఇక్కడ జరిగిన హింసను దృష్టిలో పెట్టుకొని రెండవ దశ ఎన్నికలు జరుగుతున్న మూడు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.