Published On: Fri, Jul 10th, 2015

బాహుబలి రివ్యూ …..

Share This
Tags

ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా మాటలే వినిపిస్తున్నాయి సుమారు రెండు సంవత్సరాలు ఎదురు చూసిన అభిమానులకు తెరపై తిలకించే అవకాసం రానే వచ్చింది…

చిత్ర కథ:

అమరేంద్ర బాహుబలి(ప్రభాస్) తనయుడు అయిన మహేంద్ర బాహుబలి(ప్రభాస్)ని శివగామి(రమ్యకృష్ణ) భాల్లాల దేవా(రానా) నుంచి కాపాడి జలపాతం కింద నివసిస్తున్న ఓ తెగ దగ్గరికి చేరేలా చేస్తుంది. అప్పటి నుంచి ఆ తెగ పెద్ద అయిన రోహిణి ఆ బాబుకి శివుడు(ప్రభాస్) అని పేరు పెట్టుకొని పెంచి పెద్ద చేస్తుంది. శివుడికి చిన్న తనం నుంచి జలపాతం అవతల ఏమున్నది అనే సందేహం వెంటాడుతుండేది. అప్పటి నుంచి ఆ పర్వతానికి ఎక్కడానికి ప్రయత్నించి విఫలం అయ్యేవాడు.

ఇలా ఉండగా అతనికి ఓ రోజు జలపాత పర్వతంపై నుంచి ఓ ముసుకు దొరుకుతుంది. అది అవంతి(తమన్నా) ముసుగు అని తెలిసి ఆమెను కలవాలని అన్న తపన ఆమె ఊహ ఇచ్చిన ప్రేరణ పర్వతానని ఎక్కేస్తాడు. అక్కడికి వెళ్లి అవన్తికను చూసిన శివుడు ఆమెకు తెలియకుండానే ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అవంతిక మరియు కొంతమంది కలసి భాల్లాల దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటారు.

వారి ఆశయం పాతికేళ్ళుగా భాల్లాల దగ్గర బానిసగా చిత్ర హింసలు గురవుతున్న దేవకన్య (అనుష్క) ని కాపాడి తీసుకురావడం. కాగా వీరిలో పలువురు ప్రయత్నించి భాలలాల దేవుని సైన్యం చేతిలో మరణిస్తారు. ఈసారి దేవసేనాను తీసుకొచ్చే అవకాశం అవంతికకు వస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి ఆశయం తన ఆశయం అని దేవసేనాను భాల్లాల దేవుడి నుంచి విపించుకు రావడానికి బయలుదేరుతాడు శివుడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెరపై చూడాల్సిందే….!

నటీనటుల ప్రతిభ :

శివుడు గా ప్రభాస్ :- చిన్నప్పటి నుంచే ఆటవిక ప్రాంతంలో పెరిగిన శివుడుకి కొండలు , కోనల్లో సాహసాలు చేయడంలో దిట్ట. అటువంటి పాత్రలో ప్రభాస్ రిస్కీ స్టంట్స్ బాగా చేశాడు. ముఖ్యంగా కేరళలో షూట్ చేసిన సీన్స్, తమన్నా కోసం వెళ్ళినప్పుడు వచ్చే కొన్ని సన్నివేశాలు మిమ్మల్ని అమితంగా కట్టుకుంటాయి. ఇంట్రడక్షన్ సన్నివేశాల్లో డి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు.

బాహుబలి గా ప్రభాస్: – బలమైన బాహువులు కలిగిన బాహుబలి లుక్ లో ప్రభాస్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి ప్రభాస్ ప్రభాస్ గతంలో ఎన్నడు లేని విధంగా భరే కాయంతో , బలమైన కండలతో కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కటౌట్ చూస్తె మీ ఒళ్ళు గగ్గుర్పోడిచేలా ఉంటుంది. బుద్ధి బలం-కండబలం కలగలిపిన ఈ పాత్రలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ అదరహో అనేలా అంది. వార్ సీక్వెన్స్ లో ప్రభాస్ చూపిన వీరత్వం మీ రోమాలు నిక్కబోడుచుకునేలా చేస్తుంది. ప్రభాస్ బాహుబలి, శివుడు పాత్రలకి మధ్య వైవిధ్యంగా బాగా చూపించాడు.

భాల్లాల దేవా గా రానా� :- ఇప్పటివరకు చూసిన రానా ఒక లెక్క , బాహుబలి లో కనపడే రణ ఒక లెక్క….రాజమౌళి అంటేనే విలనిజంతో ఉచ్చస్థాయిని చూపిస్తాడు. ఆ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా రణ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శత్రువు ఎదురొస్తే బుడ్డి బలం కంటే కండబలం ని నమ్ముకునే వాడిగా, క్రూరత్వం అనేది అతన్ని చూసే పుట్టిందా అనే స్వభావం కలిగిన భాల్లాలదేవా పాత్రలో రణ చూపిన పెర్ఫార్మెన్స్ అద్భుతం అని చెప్పాలి. యుద్ద భూమిలో భాల్లాలదేవగా రానాని స్క్రీన్ పై చూస్తుంటే కూర్చున్న ప్రేక్షకుల వెన్నులో వణుకు పుడుతుంది. అంతలా నెగిటివ్ షేడ్స్ ని చూపించాడు.

అవంతిక గా తమన్నా:- ఇప్పటివరకు తమన్నా మిల్కీ బ్యూటీ, గ్లామ్ దాల్ అనిపించుకున్నది. కానీ ఈ సినిమాలో అవంతికగా కుందనపు బొమ్మలా కనపడటమే కాదు శత్రువు ఎదురుపడినా, ఒక ఆపద వస్తున్న నిలబడి డీకొట్టే పాత్రలో బాగా చేసింది. తమన్నా చేసిన స్టంట్స్ , కత్తి యుద్ద్దలు కచ్చితంగా ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తాయి. పచ్చబోట్టేసినా సాంగ్ లో తమన్నా అందాలు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ప్రభాస్-తమన్నా కెమిస్ట్రీ బాగున్నది.

దేవసేనగా అనుష్క :- దేవసేనగా అనుష్క కనిపించేది తక్కువ సమయమే. అయిన అది కుడా మీరు ట్రైలర్ లో చూసిన లుక్ లో ఓ ఖైదీగా కనిపిస్తుంది. కానీ తను మొదటిసారి నోరు తెరిచి కట్టప్పతో మాట్లాడే సన్నివేశం మాత్రం అద్భుతం.

శివగామి గా రమ్యకృష్ణ :- డి పవర్ అఫ్ విమెన్ అని చూపే పాత్ర శివగామి. ఒక రాజ్యాన్ని తన అధీనంలో సమర్ధవంతంగా నడిపించగల సత్తా ఉన్న రాణి రమ్యకృష్ణ నటన. ఆ పాత్రలో రౌద్రం అందరిని కట్టిపడేస్తుంది. శివగామి పాత్రని రమ్యకృష్ణ తప్ప మరొకరు చేయలేరు. ప్రతి సన్నివేశంలో అద్భుతమైన ఎమోషన్స్ ని చూపారు.

కట్టప్పగా సత్యరాజ్:- నమ్మకానికి , ధైర్యానికి మారుపేరైన సైన్యాధిపతిగా కట్ట్ప్ప పాత్రలో సత్యరాజ్ కనిపిస్తాడు. సత్యరాజ్ ఎమోషన్స్ చూపించడంలో ది బెస్ట్ అని కట్టప్ప పాత్రలో మరోసారి మెప్పించాడు. ఇది పక్కన పెడితే తన 60ఏళ్ల వయసులో కూడా 25ఎల్లా కుర్ర్రాడిలా ప్రభాస్ తో చేసిన ఫైట్ , వార్ ఎపిసోడ్స్ లో చేసిన స్టంట్స్ చూసి కచ్చితంగా షాక్ అవుతారు. ఆ వయసులో కూడా హీరోలైన ప్రభాస్, రానాలకు దీటుగా కత్తి తిప్పుతూ చేసిన రిస్కీ స్టంట్స్ మీచేత శభాష్ అనిపించేలా ఉన్నది కట్టప్ప పాత్ర.

బిజ్జలదేవ గా నాజర్:- మోసం , స్వార్ధపూరితమైన స్వభావం కలిగిన బిజ్జలదేవ పాత్రలో నాజర్ పర్ఫెక్ట్ గా సరిపోయారు. నాజర్ చెయ్యి లేని అవితివాడిగా నెగిటి ఎమోషన్స్ ని బాగానే చూపించాడు.

కాలకేయ గా ప్రభాకర్:- ఓ క్రూరమైన ఆటవిక తెగకి చెందిన రాజుగా ప్రభాకర్ నటించాడు. కాలేకేయాగా ప్రభాకర్ రూపమే ర్పెక్షకులని భయపెట్టేలా ఉంటుంది. దానికి తోడూ ఆయనచేత చెప్పించిన కిలికి భాష డైలాగ్స్ లో ఇంటెన్స్ కనిపించడం. తన విలనిజాన్ని మరింత పెంచేలా ఉంటుంది. వార్ ఎపిసోడ్ బాగా చేశాడు.

ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే….మొదట అతిధి పాత్రలో కనిపించినాస్ సుదీప్ అస్లామ్ ఖాన్ పాత్రలో మెప్పించాడు. ఇక ఆటవిక ప్రాంతానికి చెందినా లేడీ పాత్రలో రోహిణి నటన బాగున్నది. భాల్లాలదేవ కోసం ఏమి చేయడానికైనా సిద్దపడే అడవి శేష్ నెగిటివ్ షేడ్స్ బాగా చూపించాడు. తనికెళ్ళ భరణి ఓకే. మనోహరి సాంగ్ లో కనిపించిన నారా ఫతేహి , స్కార్లెట్ విల్సన్ లు తమ అందాలతో ఫ్రెంట్ బెంచ్ వారిని ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం:

దర్శకుడు రాజమౌళి :-ఇక ఆయన ఈ సినిమాలో చేసిన ది బెస్ట్ వర్క్ మరియు మిస్టేక్స్ విషయానికి వస్తే.. మొదటగా ఆయన చేసిన మిస్టేక్ అంటే కథా పరంగా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ ని ఎంచుకోకపోవడం. విజయేంద్ర ప్రసాద్ గారు బాహుబలి కోసం చాలా బలమైన పాత్రలని సృష్టించారు కానీ ఆ పాత్రలని కలుపుతూ బలమైన కథని మాత్రం రాసుకోలేకపోయారు. ఈ విషయాన్ని ఎక్కడో మిస్ అయినట్టున్నారు రాజమౌళి. ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే.. ఇక రాజమౌళి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగుంది.

కానీ స్క్రీన్ ప్లే పరంగా సినిమాకి 70% న్యాయం చేసాడు. కథాపరంగా చెప్పాల్సింది, బిల్డప్ చేయాల్సిన పాయింట్స్ చాలా ఎక్కువ ఉండడం వలన ఆ 30% అక్కడక్కడా బాగా డ్రాగ్ అవ్వడం, ఈ సీన్ కథకి అవసరం లేదేమో అనే ఫీలింగ్ ని కలిగించాయి. అలాగే క్లైమాక్స్ విషయంలో ఆడియన్స్ ని అనుకున్న స్థాయిలో సంతృప్తి పరచలేకపోయాడు. ఇక దర్శకుడిగా మాత్రం రాజమౌళి ‘ఆల్వేస్ ది బెస్ట్’ అని మరోసారి నిరూపించుకున్నాడు.

కథలో రాసుకున్న 8 పాత్రలకు పర్ఫెక్ట్ ఎలివేషన్ ఇచ్చాడు, ప్రతి పాత్ర నుంచి ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజమౌళి బాహుబలి టీంలోని ప్రతి ఒక్కరి నుంచి ‘న భూతో న భవిష్యత్’ అనే రేంజ్ లో పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. ఓవరాల్ గా ఈ సినిమాకి కెప్టెన్ అయిన రాజమౌళి తెలుగులో ఇలాంటి ఓ సినిమాని అటెంప్ట్ చేసినందుకు హ్యాట్సాఫ్ చెప్పాలి.

సెంథిల్ కుమార్ :- డైరెక్టర్ విజన్ ని మొదట అర్ధం చేసుకొని దానికి తగ్గట్లుగా ఫ్రేం ని సెట్ చేసి పెర్ఫెక్ట్ విజువల్స్ రాబట్టుకోవాలసిన పనిని సెంథిల్ కుమార్ 100% సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. వార్ ఎపిసోడ్ , కేరళ వాటర్ ఫాల్స్ ఎపిసోడ్, ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్స్ తను షూట్ చేసిన విధానమ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.

ఆర్ట్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ :- మాహిష్మతి రాజ్యం అనగానే రాజమౌళి మదిలో కొన్ని ఊహా చిత్రాలు ఉంటాయి ఆ ఊహా చిత్రాలను అర్థం చేసుకొని వాటికి పర్ఫెక్ట్ రూపాన్ని కల్పించి ఆ సెట్లతో ఆడియన్స్ ని మరో లోకానికి తీసుకెళ్ళిన క్రెడిట్ మాత్రం సాబు సిరిల్ కే చెందుతుంది. సెట్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఇది అసలు తెలుగు సినిమానేనా అని సీట్ చివర్లో కూర్చొని కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. సెట్స్ మాత్రమే కాకుండా ప్రతి పాత్ర స్వభావానికి తగ్గట్టుగా ఆయన డిజైన్ చేసిన ఆయుధాలు అద్భుతం అని చెప్పాలి.

విఎఫ్ ఎక్స్ , సూపర్ విజన్ శ్రీనివాస్ మోహన్ :- రాజమౌళి , సాబు సిరిల్ కలసి ఓ రూపం తెప్పించిన సెట్స్ , వార్ ఫీల్డ్ , భారీ విజువల్స్ ని తన గ్రాఫికల్ మాయాజాలంతో ప్రాణం పోసింది మాత్రం శ్రీనివాస్ మోహన్. ప్రతి సన్నివేశం లో తన సిజి షాట్స్ కోసం బ్లూమాట్ ఎక్కడ ఎలా సెట్ చేయాలో చూసుకొని, ఆన్ స్క్రీన్ మునుపెన్నడూ చూడని గ్రాండ్ విజువల్స్ తో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధుల్ని చేశాడు శ్రీనివాస్ మోహన్. రాజమౌళి కలల మాహిష్మతి రాజ్యానికి ప్రాణం పోసి మనకో సరికొత్త అనుభూతిని క్రియేట్ చేసిన సెంథిల్ కుమార్, సాబు సిరిల్ మరియు శ్రీనివాస్ మోహన్ లకు తెలుగు ఆడియన్స్ అందరి తరపునా స్పెషల్ థాంక్స్ చెప్పాలి.

సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి:- ఇంతమంది కలసి క్రీన్ పై తెచ్చిన ఓ సినిమాకి తన సంగీతంలో ప్రేక్షకులకి చేరువ చేయడంలో కొంతమేర ఎంఎం కీరవాణి కూడా సక్సెస్ అయ్యాడు. ప్రభాస్, రానా,రమ్యకృష్ణ , తమన్నా పాత్రలు ఎలివేషన్ సీన్స్ లో, వార్ ఎపిసోడ్ లో రిరికార్డింగ్ బాగున్నది. కానీ కొన్ని చోట్ల వందశాతం అవుట్ పుట్ రాలేదని అనిపిస్థున్నది.

నిర్మతలు :- ఎంత స్టార్ డైరెక్టర్ అయిన తన దగ్గర ఎంత టొప్ప కథ ఉన్నా నిర్మాత అనే వ్యక్తి లేకపోతె ఆ ప్రాజెక్ట్ అటక ఎక్కాల్సిందే. కానీ రాజమౌళి చెప్పిన కథని దాన్ని నమ్మి తెలుగు సినిమా చరిత్ర దశ దిశని మార్చాలనే కోరికతో ఈ సినిమా చేయడానికి సాయి అన్న శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లకు హాట్సాఫ్. వాళ్ళు లేకపోతె ఈ సినిమా లేదు. అందుకే వారి రిస్క్ అండ్ డేరింగ్ కి సెల్యూట్ చేస్తున్నాం.

About the Author