ఫౌండేషన్ వాడుతున్నారా?
మేకప్‌కి వాడే సౌందర్య ఉత్పాదనలు ఈ కాలంలో చర్మసంరక్షణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. వార్డ్‌రోబ్‌లో చలిని తట్టుకోవడానికి దుస్తులను ఎలా సెట్ చేసుకుంటారో అలాగే సౌందర్య ఉత్పాదనల విషయంలోనూ జాగ్రత్త వహించాలి.
చలికాలం ఫౌండేషన్ కట్టిపెట్టడానికి ముఖ్యమైన కాలం. ఈ కాలం చర్మం పొడిబారుతుంది. ఫలితంగా చర్మం దురద పెడుతుంది.
పొడిబారిన చర్మాన్ని మరింత ఇబ్బందిపెట్టకుండా వాతారణాన్ని తట్టుకునే విధంగా సరైన ఫౌండేషన్‌ని ఎంచుకోవాలి.
లిక్విడ్ ఫౌండేషన్ మేలైన ఎంపిక. మాయిశ్చైరైజర్ ఉన్న ఫేసియల్ క్లెన్సర్, నాణ్యమైన మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ లోషన్ వాడితే చర్మం పొలుసులుగా అవదు. ఏ మేకప్‌వేసుకున్నా ముందుగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ తప్పక వాడాలి.
చర్మతత్త్వం తెలుసుకుంటే ఎలాంటి ఉత్పత్తులు వాడాలో సులువుగా తెలుస్తుంది. అందుకని కాలానుగుణంగా వచ్చే చర్మసమస్యలకు వైద్యనిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు ఉత్పాదనలను ఎంచుకోవాలి.
వేసవిలో పౌడర్ వాడుతున్నాం కదా అని చలికాలంలోనూ ఉపయోగించడం సరైనది కాదు.
పౌడర్ వాడటం వల్ల పొడిబారిన చర్మం పొరల్లోకి చేరి మరింత తేమను కోల్పోయేలా చేస్తుంది. పౌడర్లు వాడే వారు చర్మం తేమను కోల్పోకుండా చేసే హైడ్రేటింగ్ ఫార్ములా ఉన్నవాటిని ఎంచుకోవాలి.
లిక్విడ్ ఫౌండేషన్‌లో మాయిశ్చరైజర్స్, చర్మం పై తేమను ఉంచే సుగుణాలు ఉన్నాయా, లేవా అనేది ప్రొడక్ట్ లేబుల్‌పై చూసి ఎంచుకోవాలి.
ఫౌండేషన్ ముఖానికే కాకుండా మెడకు కూడా ఉపయోగించాలి. లేదంటే ముఖం ఫెయిర్‌గా, మెడ నలుపుగా కనిపించే ప్రమాదం ఉంది.