Published On: Wed, Dec 18th, 2013

ప్రజా మన్ననలను సంపాదించేనా …..

Share This
Tags

రాజకీయాలంటే ఏమిటో తెలియదు… నేతలతో సత్సంబంధాలు కూడా లేవు… అయినప్పటికీ తండ్రి యర్రంనాయుడు అకాల మరణంతో తెరమీదకు వచ్చాడు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం తెలుదేశం పార్టి శ్రీకాకుళం పార్లమెంటు నియోజిక వర్గ ఇంచార్జ్ పనిచేస్తున్న రామ్మోహన నాయుడు అనుభవం లేకపోయినా తనదైన స్టైల్ లో దుసుకుపోతున్నాడు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి తో డీ కొట్టబోతున్న ఈ యువనేత ఎ మేరకు ఫలితాలు సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది.

రాజకీయ ప్రవేశం :
ఈయన పేరు కింజరాపు రామ్మోహన్ నాయుడు… ఇరవై ఆరేళ్ళ వయస్సు లోపు ఉన్న ఇతను తెలుగుదేశం పార్టి శ్రీకాకుళం పార్లమెంటరి నియోజిక వర్గానికి ఇంచార్జ్ గా ఉన్నారు. తండ్రి, టిడిపి సీనియర్ నేత కింజరాపు ఎర్రంనాయుడు అకాల మరణం తో అనూహ్యంగా రాజాకీయాల్లోకి ఎంటరైన ఈ కొత్త తెలుగు తమ్ముడు రాజకీయ అనుభవం తక్కువ ఉన్నప్పటికీ అందరిని కలుపుకుపోతూ తనదైన స్టైల్ లో శ్రీకాకుళం జిల్లా టిడిపిని ముందుకు నడుపుతున్నారు. జాతీయ స్థాయి లో మంచి పలుకుబడి ఉన్న నేతగా పేరున్న కింజరాపు ఎర్రంనాయుడు రోడ్డు ప్రమాదం లో అకాల మరణం చెందటం, సన్నిహితుల సలహా మేరకు, కార్యకర్తల పిలుపు మేరకు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి రావడం చక చకా జరిగిపోయాయి. తండ్రి, దివంగత నేత ఎర్రంనాయుడు రామ్మోహన్ నాయుడు ను చిన్నతనం నుండే ఇంటికి దూరంగా ఉండి చదివించేవారు.. అయిదవ తరగతి వరకు భాగ్యనగరం లో చదివిన రామ్మోహన్ నాయుడు ఆ తరువాత ఇంటర్ మీడియట్ వరకు డిల్లి లో చదివారు. అక్కడి నుండి పూర్తిగా విదేశాలకే పరిమితం అయ్యారు..ఇంజనీరింగ్ ను అమెరికా లోనే పూర్తి చేశారు.. తరువాత ఎం.బి.ఎ ను కూడా లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ లో కంప్లీట్ చేశారు..
సవాళ్లు :
అస్సలు రాజకీయ అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తలలు పండిన నేతలున్న శ్రీకాకుళం జిల్లా తెదేపా సైకిల్ ను ఎలా నడుపుతారా అన్న సందేహం మొదట అందరి మదిలో మెదిలింది. జిల్లా లో మిగిలిన అధికార, విపక్ష పార్టీలు సీనియర్ నేతలతో, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతుంటే,, అస్సలే జిల్లా లో పీకల్లోతు కష్టాల్లో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీని రామ్మోహన్ నాయుడు ఎలా గాడిలో పెడతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు టిడిపిలో ఒకప్పుడు టాప్ మోస్ట్ గా పేరుపొందిన కళా వెంకటరావు, తమ్మినేని సీతారాం, కావలి ప్రతిభా భారతి, గౌతు శ్యామసుందర శివాజీ లాంటి సీనియర్ల మద్య ఎలా ముందుకు వెళతారనేది కూడా సస్పెన్స్ గా మారింది. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తు రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004కు ముందు శ్రీకాకుళం జిల్లా మొత్తం టిడిపి హవా నడిచింది.. శ్రీకాకుళం జిల్లా అంటే టిడిపి.. టిడిపి అంటే శ్రీకాకుళం అనే పరిస్థితి ఉండేది. అయితే ఎక్కువకాలం అధికారం లో ఉంటె ఆ పార్టి పై ప్రజల్లో సహజంగా వచ్చే వ్యతరేఖతకు తోడు జిల్లా తెదేపా లో పెరిగిన గ్రూపు రాజకీయాలు శ్రీకాకుళం జిల్లా తెదేపా కంచు కోటను ధ్వంసం చేశాయి. ఆ తరువాత జిల్లా లోని నేతల మధ్య కూడా దూరం పెరిగింది. ఇంతింతై… వటుడింతై అన్నట్టు… జిల్లా లో తెదేపా పరిస్థితి దయనీయంగా మారింది. అయినా చంద్రబాబు కుడి భుజం, సిక్కోలు టిడిపి పెద్దదిక్కు అయిన ఎర్రంనాయుడు జిల్లాకు అన్నితానై ముందుకు నడిపించారు.. అధికారం లో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ.. జిల్లా లో తెదేపా ఉనికిని కాపాడుకుంటూ వచ్చేవారు. అయితే రోడ్డు ప్రమాదం లో ఆయన అకాల మరణం చెందటం తెదేపా కు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి… ఎర్రంనాయుడు మరణం తో శ్రీకాకుళం జిల్లా తెదేపా పూర్తిగా మూగబోయింది.. కార్యకర్తల్లో నిరుత్సాహం అధికమయ్యింది.. తండ్రి చనిపోయిన ఇలాంటి సమయంలో.. జిల్లా తెదేపా పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న టైం లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కింజరాపు రామ్మోహన్ నాయుడు.. నిజానికి ఇది ఆయనకు పెద్ద సవాలే…అయితే సీనియర్ల సలహాలు, సూచనలు తండ్రి ఆశీస్సులు కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని రామ్మోహన్ నాయుడు పేర్కొంటున్నారు.
బైట్: కింజరాపు రామ్మోహన్ నాయుడు
వాయిస్: పీకల్లోతు కష్టాల్లో ఉన్న జిల్లా తెదేపా సైకిల్ పై రామ్మోహన్ నాయుడు సవారి నెమ్మదిగా ప్రారంభం అయింది.. తండ్రి మార్కు రాజకీయ ఫార్ములా తో నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను కలుస్తూ అందరి లో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. ఇలాంటి సమయం లో ఇతని వెంట ఎవ్వరు సీనియర్ నాయకులు లేరు.. జిల్లా కు చెందిన మిగిలిన సీనియర్ నాయకులు కూడా గోడపై ఉంటూ జంపింగ్ లకు సిద్ధంగా ఉన్నారు కూడా… జిల్లా నేతల సహకారం తక్కువైనా సమర్ధంగా పార్టీని జిల్లా లో నడిపించడం లో రామ్మోహన్ నాయుడు సఫలం అయ్యారనే చెప్పాలి..

భవిష్యత్ :
ఇవన్నీ ఒక ఎత్తు అయితే భవిష్యత్ లో రామ్మోహన్ నాయుడు కు మరిన్ని సవాల్ లు ఎదురుకానున్నాయి. రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరి నియోజుక వర్గం నుండి బలమైన నేతలు బరిలోకి దిగనున్నారు.. కాంగ్రెస్ తరుపున ప్రస్తుత ఎం.పి కేంద్ర ఐ.టి కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి బరిలోకి దిగుతుండటం, వై.కా.పా నుండి కూడా మరో బలమైన సామాజిక బలం ఉన్న నేతను రంగం లోకి ఆలోచనలో ఆ పార్టి ఉండటంతో రామ్మోహన్ నాయుడు కు ఇది పెద్ద సవాలే అని చెప్పాలి. రాజకీయాల్లో తలలు పండిన నేతలతో రామ్మోహన్ నాయుడు ఎలా డీ కొట్టబోతున్నారా అనే ఆతృత అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని చెప్పాలి.. ప్రస్తుత ఎం.పి కృపారాణి కేంద్ర మంత్రి పదవి లో ఉండటంతో జిల్లా కు అధికంగా లబ్ది చేకూరే పనులు చేస్తుండటం.. ఆమెకు వచ్చే ఎన్నికల్లో ప్రధాన బలంగా మారనుంది.. ఇక రామ్మోహన్ నాయుడు విషయానికి వస్తే తండ్రి సెంటిమెంట్ జిల్లా ప్రజలలో బలంగా నాటుకుపోవడం, సెంటిమెంట్ పారింది అంటే జిల్లా లో చెదరని ఓటు బ్యాంక్ ఉన్న టిడిపి సునాయాసంగా విజయం సాధించే అవకాశం ఉంది.. ఈలోగా ప్రజల మద్య అధికంగా ఉండి, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ జిల్లా లో రామ్మోహన్ నాయుడు ముందుకెళ్ళాల్సి ఉంది… అయితే ఇదంతా ఎన్నికలు వచ్చేలోపు ఆయా నాయకులు, పార్టిలు చేసే హడావిడి పైన ఆధారపడి ఉంటుంది.. అంచనాలకు అందని శ్రీకాకుళం జిల్లా ఓటరు మదిలో ప్రస్తుతానికి ఎవరున్నారు అన్నది సమాధానం లేని ప్రశ్న.. మొత్తానికి చిన్న వయస్సు లోనే రామ్మోహన్ నాయుడు పెద్ద బరువు బాధ్యతలను తన భుజస్కందాలపై మోస్తున్నారు. ఇప్పటికే తన పార్లమెంటరీ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ఎర్రన్న తనయుడు నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయంతో నడవాల్సి ఉంది. ఇటీవల టిడిపికి గండిపేట మహనాడులో తనదైన స్టైల్ లో ప్రసంగించి అధినేత చంద్రబాబును ఆకట్టుకున్న రామ్మోహన్ నాయుడు చిక్కోలు ప్రజల మన్ననలు కూడా పొందుతారా లేదా అనేది భవిష్యత్ కార్యాచరణపై ఆదారపడి ఉంది.

తెలుగు జాతిని అవమానించే అంత దమ్ము ఢిల్లీ పెద్దలకు ఎక్కడ నుంచి వచ్చింది? తెలుగోడి పౌరషం చూపించే జన నేత ఎక్కడ? పార్లమెంట్లో మాటలు తూటాలు పేల్చిన ఆ మహా మనిషి ఏమయ్యాడు? దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో ఇదే చర్చ. ఎర్రన్నాయుడు ఉంటే కొండంత అండగా నిలబడేవారు. అతను లేని లోటు ఈ రోజు కనిపిస్తోందంటూ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వెన్నులో వణుకు పుట్టించిన మన ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రన్న మన మధ్య లేకపోయినా ఆయన వదిలి వెళ్లిన ఆదర్శాలు కొనసాగుతున్నాయి. ఎర్రన్న పోరాటాలకు కొనసాగింపుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు తండ్రి బాటలోనే నడుస్తున్నాడు. ఉన్నత చదువు చదివి తెలుగుదేశం పార్టీ కోసం..ఎర్రన్న అభిమానులు కోసం జనం మధ్యలోకి వచ్చారు. తండ్రిలానే పేదోడి పక్కన నిలబడుతున్నారు. రూపంలో ఎర్రన్నలా ఉండడమే కాదు.. వ్యక్తిత్వంలోనూ అయన లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. జన నేతగా బుధవారం తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఉత్తరాంధ్ర యువ కెరటం కింజరాపు రామ్మోహన్ నాయుడుకు ఎర్రన్న అభిమానులు తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

About the Author