పాపం కృష్ణదాస్ ….
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎం.ఎల్.ఎ ధర్మాన కృష్ణదాస్ అనుచరులు తెగ ఫీలైపోతున్నారు ….
అనుచరులేమిటి ధర్మాన ఫ్యామిలీ కూడా ఇదే విషయం చేర్చకు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది….
కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి వై.కా.పా లోకి వెల్లకుండా ఉండివుంటే దశ తిరిగి వుండేదనేది వీరి భావన ….
సి.బి.ఐ అభియోగాలు ఎదుర్కొని మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావు స్థానం లో కృష్ణదాస్ కు తప్పక మంచి పదవి వరించి ఉండేదన్నది అంచనా….
అయితే ధర్మాన బ్రదర్స్ భవిష్యత్ వ్యూహం పై చర్చించకుండానే నిర్ణయాలు తీసుకున్నారా అన్నది టాప్ సీక్రెట్ ……