పాక్‌కు వచ్చిన వెంటనే ముషార్రఫ్ అరెస్ట్!
స్వీయ ప్రవాసం నుంచి పాకిస్థాన్‌కు తిరిగొచ్చిన వెంటనే మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్‌ను అరెస్టు చేస్తారని సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు. ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆయనపై శాశ్వత వారంట్లు జారీ చేసిందని చెప్పారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడ్డాక గానీ లేదా అంతకుముందే గానీ పాక్‌కు వచ్చినా ముషార్రఫ్‌ను అరెస్టు చేస్తారని ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్‌ఐఏ) ప్రత్యేక న్యాయవాది చౌధరి జుల్ఫికర్ అలీ స్పష్టం చేశారు. నేర శిక్షాస్మృతి నుంచి ఆయన తప్పించుకోలేరన్నారు. మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో హత్య కేసులో దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నిరాకరించిన ముషార్రఫ్‌పై ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శాశ్వత వారంట్లు జారీ చేసింది. ఆయన పరారీలో ఉన్నట్టుగా ప్రకటించింది.