Published On: Tue, Oct 29th, 2013

మహిళా లోకం మెచ్చే రీతిలో ….వై.ఎస్.అర్ సిపి నేత వరుదు కళ్యాణి…

Share This
Tags

ఆత్మవిశ్వాసం …ఎదో సాదించాలన్న తపన …వెరసి ఆమెలో నాయకత్వ లక్షణాలు వెలికితీసాయి.ఓ మారుమూల పల్లెలో పుట్టినప్పటికీ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రజల సేవ చేయాలన్న తపన ఆమెను రాజకీయాలవైపు నడిపించాయి.గడిచిన దశాబ్దాల కాలంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో తనదైనశైలి ముద్ర వేసుకున్న వై.ఎస్.ఆర్ సిపి లీడర్ వరుదు కల్యాణి మహిళా లోకానికే మార్గదర్సకంగా నిలిచారు.శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన వరుదు కళ్యాణి గత ఎన్నికలలో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి పోటీపడి ప్రస్తుత కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణికి మాజీ కేంద్ర మంత్రి ఎర్రంనాయుడుకి గట్టి పోటీనే ఇచ్చారు.రాజకీయాలలో గురువులు లేకపోవడం ప్రజారాజ్యం పార్టీకి ప్రజలు అంతగా రిసీవ్ చేసుకోకపోవటం లాంటి పరిస్తితులలో ఓటమి పాలైనప్పటికీ రాజకీయాలనుండి వెనుకడుగు వేయలేదు.పి ఆర్ పి కాంగ్రెస్ లో విలీనమైన తరువాత ఆ పార్టీలో చేరకుండా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ గూటికి చేరి జిల్లలో తనదైన శైలిలో సుడిగాలి పర్యటనలు చేసి ఆకట్టుకుంటున్నారు వరుదు కళ్యాణి.
కొంతమంది పదవులు ద్వారా నాయకులు అవుతారు..ఈమె మాత్రం ప్రజల మన్ననను కూడా గట్టుకొని నాయుకురాలిగా ఎదిగారు.అభలతలచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటూ అనతికాలంలోనే నిరూపించారు.
గడిచిన కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ నెంబర్ వన్ మహిళా పొలిటికల్ లీడర్ గా ఖ్యాతినార్జించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వరుదు కళ్యాణి పై ఈ రాష్ట్రం స్పెషల్ ఫోకస్ ….

 

 

About the Author