నీ ఆశయాలు …. నీ అడుగు జాడలు ….
ఎర్రంనాయుడు పెద్దగా పరిచయం చేయనవసరం లేని ఈ పేరు ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించింది. …. గల్లీ నుండి డిల్లీ వరకు తనదైన శైలిలో ఆకట్టుకుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా సమస్యల పరిష్కారానికి ఎర్రంనాయుడు పేరు వేదికగా మారింది.నిమ్మాడ నుండి రాజకీయ ఓనామాలు నేర్చుకొని జాతీయనేతగా నిలబెట్టింది…. దశాబ్ధాల రాజకీయ చెరిత్రలో ఎన్నో పదవులను అలంకరించింది ఆ పదవులకే వన్నె తెచ్చి ప్రజల మన్న నలను సంపాదించుకుంది….కోట్లాదిమంది అభిమానులతో అంచెలంచెలుగా ఎదిగినా ఒదిగి ఉండే స్వభావంతో భావితరాలకు సైతం మార్గదర్సకంగా నిలిచింది. …
మారుమూల ప్రాంతం …. అభివృద్ధి లేమి జిల్లా నుండి ప్రాతినిద్యం వహించినప్పటికీ తనదైన ముద్రతో తిరుగులేని నేతగా అభివృద్ధి పధంలో నడిపించి నిలువెత్తు నిదర్సనంగా మారిన ఎర్రంనాయుడును చూసి ఆ సృష్టికే కన్నుకుట్టింది. ….రోడ్డు ప్రమాదం రూపం కోట్లాది అభిమానుల నుండి ఎర్రంనాయుడు దూరం చేసింది….. దీంతో ఎంతమంది అభాగ్యుల గళాలు మూగబోయాయి…. వాయిస్ ఆఫ్ ద సిక్కోలు గా మారిన ఎర్రన్న దూరమై నవంబరు రెండు, 2013 నాటికి ఏడాదైనా. ఆయన ఆశయాలు అడుగుజాడలు మాత్రం పధిలం ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా నీ స్మృతులు సజీవం. ఎర్రన్న అమర్ రహేకింజరాపు ఎర్రంనాయుడు అభిమాన సంఘం
ఆంధ్రప్రదేశ్