Published On: Wed, Apr 23rd, 2014

నీచ రాజకీయాలు నీతి లేనిపార్టీలకు బుద్ది చెప్పండి :కిరణ్ కుమార్ రెడ్డి

Share This
Tags

దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న తెలుగు వాళ్ళని విడదీసి రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వారికి ఈ ఎన్నికలలో బుద్ది చెప్పాలని జై సమైక్యాంధ్ర పార్టీ అద్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు .నీచ రాజకీయాలకు పాల్పడుతూ నీతి లేని పార్టీలుగా నిర్ణయాలని తీసుకున్న వారిని ప్రజలు క్షమించరని స్పష్టం చేసారు..కేంద్రానికి రాష్ట్రాన్ని విడదీయాలని లేఖలు రాసి ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం తగదన్నారు ,తానూ ముందుగా ఎందుకు రాజీనామా చెయ్యలేదని ప్రశ్నించిన పలువురికి తాను సమాదానం చెప్పనక్కరలేదని అయితే ప్రజలు వాస్తవాలను గమనించాలని కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.తాను అప్పట్లో రాజీనామా చేసుంటే అసంబ్లీ లో ” టి “బిల్లు తిరస్కరణకు గురయ్యేదా అని ప్రశ్నించారు.పదవుల కోసం తానెప్పుడు పాకులాడలేదని రాష్ట్రం ఐక్యం గా ఉంటేనే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సాద్యం అని కిరణ్ స్పష్టం చేసారు.సమైక్య వాదులకే జే.యస్.పి అభ్యర్ధులుగా ఎంపిక చేసి ఉమ్మడి రాష్ట్రంలో పోటికి దించామని కిరణ్ కుమార్ రెడ్డి పెర్కున్నారు.ప్రజాస్వామ్య బద్దంగా రాజ్యంగా పరంగా విభజన జరగలేదని అరుణ్ జైట్లీ లాంటివారే అంగీకరించారని ఆయన రాష్ట్ర విభజన పాపం సి.పి.యం తప్పా అన్ని పార్టీ లకు దక్కుతుందన్నారు.ప్రస్తుత పరిణామాలు గతానుభవాలు దృశ్యమాలికలు ఈ క్రింద చూడండి….

About the Author