నిల్వ రక్తం మూడు వారాలకు మించితే చే టే!
బ్లడ్‌బ్యాంకుల్లో మూడు వారాలకు పైగా నిల్వ ఉంచిన రక్తాన్ని పేషెంట్లకు ఎక్కించడం ద్వారా అనర్థాలు జరిగే ప్రమాదముందని ఒక అధ్యయనం హెచ్చరించింది. ఇది వరకు దాతలు ఇచ్చిన రక్తాన్ని కనీసం ఆరు వారాల పాటు నిల్వ ఉంచవచ్చనే అభిప్రాయం ఉంది. అయితే తాజా అధ్యయనాల ప్రకారం ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే రక్తనాళాల సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉందని, దీన్ని ఎక్కించడం వల్ల గ్రహీతల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్రాయ్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు ఈ విషయాన్ని ప్రకటించారు. తక్కువ రోజుల పాటు నిల్వ ఉన్న రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి స్థాయి బాగుంటుందని, దీని వల్ల ఫ్లో మీడియేటెడ్ డైలేషన్ (ఎఫ్‌ఎమ్‌డీ) స్థాయి ఉత్తమంగా ఉంటుందన్నారు. ఇంతేగాక నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి రక్తంలోని ఆరోగ్య స్థాయికి నిదర్శనమన్నారు. మూడు వారాలకుపైగా నిల్వ ఉంచిన రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి తగ్గుతుందన్నారు.