Published On: Sun, Apr 20th, 2014

‘నింగి, నేల ఉన్నంత వరకు నవ్విస్తూనే ఉంటా’

Share This
Tags

మూడు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. అవన్నీ తన హృదయ ఫలకంపై తీపి గుర్తులుగా మిగిలిపోయాయని ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మనందం వెల్లడించారు. నింగి, నేల ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం పంచుతునే ఉంటానని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దలు పూరైన సందర్భంగా చెన్నైలో బ్రహ్మనందం విలేకర్లతో మాట్లాడారు.

తాను చిత్ర పరిశ్రమకు రెండేళ్ల ముందే వచ్చిన 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయి’ చిత్రం తనకు బ్రేక్ ఇచ్చిందని… నాటి జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమైన స్మృతులను ఆయన ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాలలో నటించినట్లు చెప్పారు. తాను ఈ రోజు ఇంత విజయం సాధించానంటే చిత్ర దర్శకులు,నిర్మాతలే ప్రధాన కారణమన్నారు. షూటింగ్ సమయంలో లైట్ బాయ్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్ల వరకు వారితో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మనందం ఈ సందర్భంగా విశదీకరించారు. అటు తెలుగు ఇటు తమిళ చిత్ర రంగంలో సినిమాలలో నటిస్తు 58 ఏళ్ల బ్రహ్మనందం మహా బిజీగా ఉన్నారు.

About the Author