Published On: Tue, Mar 19th, 2013

నాదల్, షరపోవాలకు టైటిళ్లు

Share This
Tags

పునరాగమనం తర్వాత స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు.  ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ మాజీ నంబర్‌వన్ విజేతగా నిలిచాడు.

ఫైనల్లో నాదల్ 4-6, 6-3, 6-4తో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ డెల్ పొట్రో (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో ‘రష్యా సుందరి’ మరియా షరపోవా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో షరపోవా 6-2, 6-2తో కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది.

About the Author