దక్షిణాఫ్రికాకు పెరుగుతున్న భారత్ టూరిస్టులు
నాలుగేళ్ల క్రితం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల తర్వాత భారత్ నుంచి దక్షిణాఫ్రికా వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని సౌతాఫ్రికా టూరిజం కంట్రీ మేనేజర్ హానెలీ శ్లాబర్ తెలిపారు. 2009లో 57,000 మంది వస్తే.. గతేడాది 1,06,000కు చేరిందని ఆమె వివరించారు.
శనివారం ఇక్కడ లెర్న్ సౌతాఫ్రికా పేరిట ట్రావెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా శ్లాబర్ ఈ విషయాలు తెలిపారు. దక్షిణాఫ్రికాలో టూరిజానికి సంబంధించి కేప్ టౌన్, క్రూగర్ నేషనల్ పార్క్ ప్యాకేజీలకు ఎక్కువగా డిమాండ్ ఉంటోందన్నారు. రెండు వారాల ప్యాకేజీ ఖర్చు దాదాపు రూ. 1 లక్ష స్థాయిలో ఉంటుందని శ్లాబర్ వివరించారు