ట్రిపుల్ ఐటీలకు 458 రెగ్యులర్ పోస్టులు
ట్రిపుల్ ఐటీలకు ప్రభుత్వం 458 రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసిందని కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ ఇబ్రహీంఖాన్ సోమవారం తెలిపారు. రాష్ట్రంలోని మూడు ట్రిపుల్ ఐటీల్లో సిబ్బంది అంతా ఐదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలోనే కొనసాగుతున్నారు. డెరైక్టర్ల కాంట్రాక్టు మూడేళ్లకోసారి పొడిగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సిబ్బందిని నియమించాలని, 750 రెగ్యులర్ పోస్టులు మంజూరు చేయాలని ఆర్జీయూకేటీ వీసీ ఆర్.వి.రాజకుమార్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.