టెన్త్ మూల్యాంకనం 12నుంచి చేపట్టాలి
పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల మూల్యాంకనం ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మూల్యాంకనాన్ని 10వ తేదీ నుంచే ప్రారంభించాలని కమిషనర్ నిర్ణయించారని, 11న ఉగాది పర్వదినం వచ్చిన నేపథ్యంలో 12 నుంచి ప్రారంభించాలని కోరారు. జిల్లాల్లో ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు లేనందున వెంటనే తుది లిస్టు ప్రకటించాలన్నారు.