జేఈఈ-మెయిన్స్‌కు అర్హతపత్రం తప్పనిసరి
ఈ నెల 7న ఆఫ్‌లైన్‌లో జరిగే జేఈఈ-మెయిన్స్ పరీక్షకు, తదుపరి జరిగే జేఈఈ-మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులంతా అర్హత పరీక్షకు సంబంధించిన గుర్తింపు పత్రం తేవాలని జేఈఈ-మెయిన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజ్‌బీర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 12వ తరగతి రాసిన విద్యార్థులు హాల్‌టిక్కెట్‌తో.. గత ఏడాది, అంతకుముందు ఏడాది రాసి ఉత్తీర్ణులైనవారు మార్కుల మెమోతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.