జడేజాను మందలించిన అంపైర్ అలీమ్!
భారత ఆటగాడు రవీంద్ర జడేజా ప్రవర్తన తీరుపై అంపైర్ అలీమ్ దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అవుటైన తర్వాత జడేజా అతిగా ప్రవర్తించడంతో అంపైర్ తీవ్రంగా మందలించారు. అంపైర్ అవుట్ ఇవ్వకముందే జడేజా ఆనందంతో గంతులేయడం అంపైర్ కు కోపం తెప్పించింది. దాంతో సచిన్ పిలిచి జడేజాను ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు.