Published On: Fri, Apr 26th, 2013

చెవుడుకు చెక్‌పెట్టే కొత్త పరికరం

Share This
Tags

వంశపారంపర్యంగా వచ్చే చెవుడుతో బాధపడుతున్నవారికి శుభవార్త. అలాంటివారు అన్ని ధ్వనులను స్పష్టంగా వినేందుకు తోడ్పడే.. సరికొత్త పరికరాన్ని స్కాట్లాండ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ వర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ‘బోన్ బ్రిడ్జ్’గా పిలుస్తున్న ఈ పరికరాన్ని చెవి పైభాగంలో శస్త్రచికిత్స ద్వారా అమరుస్తారు. దీనిలో శరీరం బయటకు కనిపించే భాగం ధ్వనులను గ్రహించి… పుర్రె ఎముకల ద్వారా చెవిలోపలి భాగానికి చేరవేస్తుంది. అక్కడి నుంచి మెదడుకు సంకేతాలు వెళ్లి, ధ్వనిని వినగలుగుతారు. అయితే.. ‘‘వంశపారంపర్య చెవుడుతో బాధపడుతున్నవారికి సాధారణ వినికిడి పరికరాల వల్ల లాభం ఉండదు. అలాంటివారికి ‘బోన్ బ్రిడ్జ్’ అద్భుతంగా తోడ్పడుతుంది. కొన్నేళ్లలోనే ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పరికరాన్ని బ్రిటన్‌కు చెందిన బ్రియాన్ హాగ్‌కు ప్రయోగాత్మకంగా అమర్చాం. అది అద్భుతంగా పనిచేస్తోంది’’ అని ఈ పరికరం రూపకర్తల్లో ఒకరైన అలెక్స్ బెన్నెట్ చెప్పారు.

About the Author