చీకట్లో బిల్లుకు ఆమోదమా?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభ ఆమోదముద్ర వేసింది. మూజువాణి ఓటుతో విభజన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రధాన ప్రతిపక్ష బీజేపీ మద్దతు తెలపడంతో బిల్లులో సవరణలపై సభలో ఓటింగ్ నిర్వహించింది. అయితే చీకట్లో బిల్లును ఆమోదించిన తీరుపై పలు పార్టీలు విమర్శలు గుప్పించాయి. లోక్సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, గ్యాలరీ, ద్వారాలను మూసివేసి ఓటింగ్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించాయి.
అప్రజాస్వామికంగా వ్యవహరించిన కాంగ్రెస్ను ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించాయి. దేశ ప్రజలను చీకట్లో ఉంచి బిల్లును ఆమోదించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు.