చండి కోసం ప్రియమణి ప్రత్యేక శ్రద్ధ
ప్రియమణి మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకి రెడీ అవుతుంది. చారులత క్షేత్రం వంటి సినిమాలో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసిన ప్రియమణి చండి అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. వి. సముద్ర డైరెక్షన్లో రానున్న ఈ సినిమా కథ వినగానే ప్రియమణి వెంటనే అంగీకరించింది అని దర్శకుడు చెప్పారు. పంచాక్షరి తరువాత వి. సముద్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ సినిమా కోసం ప్రియమణి విలు విద్య, గుర్రపు స్వారీ నేర్చుకుంటుంది. ఒమిక్స్ బ్యానర్ పై శ్రీను బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఆర్ శంకర్, చిన్న సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 27 నుండి మార్చ్ 15 వరకు నెక్స్ట్ షెడ్యూల్ కొనసాగుతుంది.