గ్రూప్-1 ఫలితాలు ప్రకటించండి
గ్రూప్-1 తుది ఫలితాలను త్వరగా ప్రకటించాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. ఇంటర్వ్యూలు పూర్తయి 15 రోజులు కావస్తున్నా ఫలితాల వెల్లడిలో జాప్యంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పలువురు అభ్యర్థులు మంగళవారం ఏపీపీఎస్సీ కార్యదర్శి చారుసిన్హా, కమిషన్ సభ్యులను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే, కోర్టులో కేసు ఉండడం వల్ల ఫలితాలను విడుదల చేయలేకపోతున్నామని చారుసిన్హా పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.