Published On: Sun, Nov 17th, 2013

క్రికెట్ తో అనుబంధం కొనసాగుతుంది: సచిన్

Share This
Tags

తనకు అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన క్రికెట్తో తన అనుబంధం కొనసాగుతుందని భారత రత్న పురస్కార గ్రహీత సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు. తన రిటైర్ మెంట్ అనంతరం మాట్లాడిన సచిన్ క్రికెట్తో బంధం కొనసాగుతుందని తెలిపారు. తన 40ఏళ్ల జీవితంలో 30 ఏళ్లు క్రికెట్ లోనే గడిచాయని తెలిపారు. ఈ క్రమంలో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా కష్టపడ్డానన్నాడు. రిటైర్మెంట్ కు ఇదే సరే సమయంగా భావించానని, తన హృదయం ఎప్పుడూ భారత్ విజయం కోసం పరితపిస్తుందని అన్నాడు. చివరిటెస్టు ముంబైలో ఏర్పాటుచేయమని కోరారని, తన కోరికను బీసీసీఐ మన్నించిందన్నాడు. తన తల్లి మైదానానికి వచ్చి చివరి మ్యాచ్ ను వీక్షించడం సంతృప్తినిచ్చిందన్నాడు. పిల్లల భవిష్యత్తు కోసం సర్వం త్యాగంచేస్తున్న దేశంలోని తల్లులందరికీ తన భారతరత్న అంకితం ఇస్తున్నట్లు సచిన్ తెలిపాడు.

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో తాను చేసిన తొలిసెంచరీ చేసిన ఎప్పటికీ గుర్తుంటుదన్నాడు. 22 అడుగుల పిచ్‌ దేవాలయం వంటిదని, ఇవాళ పొందినదంతా దాన్ని నుంచి వచ్చినదనేన్నాడు. ఔత్సాహిక క్రికెటర్లందరికీ తన సహాయం ఎప్పుడూ ఉంటుందన్నాడు. క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక ఏం చేశారని విలేకర్లు ప్రశ్నించగా.. ‘ నాకు నేనుగా టీ తయారుచేసుకున్నానని, నా భార్యతో కలిసి అల్పాహారం చేశానన్నాడు. అభిమానులు పంపిన ఎస్‌ఎమ్మెస్‌లకు జవాబులిచ్చానని’ సచిన్ తెలిపాడు.

About the Author