Published On: Sun, Aug 4th, 2013

కోటి దాటిన ఇ- ఐటీ రిటర్న్‌లు

Share This
Tags

ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారి సంఖ్య కోటి దాటింది. వేతనాలు తీసుకుంటున్న వారే అత్యధికంగా ఆన్లైన్లో ఆదాయపన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్టు తాజా గణంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలై 31 నాటికి 1,03,21,775 ఇ-రిటన్స్ దాఖలయినట్టు బెంగాళూరులోని ఆదాయపన్ను శాఖకు చెందిన సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్(సీపీసీ) తెలిపింది.

2012-13 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్లపైగా ఇ-రిటర్న్‌లు ఫైల్ అయినట్టు వెల్లడించింది. తాజాగా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన వారిలో 7,81,252 మంది వేతన జీవులు ఉన్నారు. గతేడాది 64 లక్షల మంది ఉద్యోగులు ఇంటర్నెట్ ద్వారా ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేశారు.

వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే గడువును ఆగస్టు 5 వరకు పొడిగిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిటర్న్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ కాగా ఆన్‌లైన్ ద్వారా దాఖలు చేసే ఈ-ఫైలింగ్‌కు విపరీతమైన ఆదరణ రావడంతో గడువును పొడిగించింది. గతేడాదితో పోలిస్తే ఆన్‌లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్యలో 46.8 శాతం వృద్ధి నమోదయ్యింది.

About the Author