Published On: Sat, May 17th, 2014

కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ కలిగించేదే: చిరంజీవి

Share This
Tags

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నిరాశ కలిగించిన మాట నిజమని కేంద్ర మంత్రి చిరంజీవి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌కు వివిధ వర్గాల ప్రజలు ఎందుకు దూరమయ్యారో నిజాయితీగా విశ్లేషించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించడానికి అవసరమైన చర్యలను కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకుంటుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన మోడీకి, చంద్రబాబుకు, కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

About the Author